ప్రేమంటే ఇదేరా : కరోనాపేషంట్‌తో ఐసీయూలో పెళ్లి..

  • Published By: nagamani ,Published On : August 18, 2020 / 05:06 PM IST
ప్రేమంటే ఇదేరా : కరోనాపేషంట్‌తో ఐసీయూలో పెళ్లి..

ప్రేమించుకోవటమంటే సినిమాలకు షికార్లు తిరగటం కాదు.కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా..ఆఖరికి చావుబతుకుల్లో కూడా ఒక్కటిగా ఉండటమే ప్రేమంటే. అటువంటి ప్రేమే ఈ అమ్మాయిది. కరోనా సోకిన తన బాయ్ ఫ్రెండ్ ని హాస్పిటల్ లోని ఐసియులోనే పెళ్లి చేసుకుంది. కరోనా వచ్చినా దాని బాబు వచ్చినా మమ్మల్ని విడదీయలేదని నిరూపించింది ఈ అమెరికా అమ్మాయి.



వివరాల్లోకి వెళితే..సాన్ ఆంటోనియాలో ఉంటున్న కార్లోస్ మునిజ్, గ్రేస్‌లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇంతలో కార్లోస్‌కు కరోనా మహమ్మారి సోకింది. దీంతో జులై 15న మెదోడిస్ట్ హాస్పిటల్‌లో చేరి ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నాడు. కానీ కొన్ని రోజుల క్రితం కార్లోస్ పరిస్థితి మరింత దిగజారటంతో నార్మల్ వార్డు నుంచి ఐసీయూకి తరలించి ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు.



కరోనా వచ్చినప్పుడు కూడా కార్లోస్ భయపడలేదు. త్వరగానే కోలుకుని వచ్చేస్తానని అనుకున్నాడు. కానీ పరిస్థితి విషమించటంతో మానసికంగా కృంగిపోయాడు. మానసిక ఒత్తిడి వల్ల తరచూ శ్వాస అందక తల్లడిల్లిపోయేవాడు. అది గమనించిన హాస్పిటల్ సిబ్బంది. అతడిని ఉత్సాహపరిచేందుకు చక్కగా మాట్లాడేవారు..అతడి వివరాలు కలనుక్కుంటూ..మాటలు కలిపేవారు. అలా కరోనా రావటంతో కార్లోస్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని తెలుసుకున్నారు.



దీంతో కార్లోస్ మునిజ్, గ్రేస్‌ల పెళ్లి జరిగితే అతడు మళ్ళీ ధైర్యంగా ఉంటాడని అనుకున్నారు. అదే మాట అతని ప్రియురాలు గ్రేస్ కి చెప్పారు. దానికి ఆమె కూడా బాధపడింది. కార్లోస్ డార్లింగ్..నువ్వు ఎలా ఉన్నా నీమీద నాకున్న ప్రేమ తగ్గదు..ఎందుకు అంత బాధపడుతున్నావ్..నీకోసం నేనున్నాను..అని ధైర్యం చెప్పింది. అంతేకాదు..నిన్ను ఈ క్షణమే పెళ్లి చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నానని చెప్పింది.



హాస్పిటల్ వర్గాలు ఐసీయూలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పెళ్లి చేసేందుకు మత పెద్దను కూడా ఆహ్వానించారు. గ్రేస్, కార్లోస్ కుటుంబం సభ్యులు కూడా ఇందుకు ఒప్పుకున్నారు. ముహూర్తం సమయానికి గ్రేస్ పెళ్లి కూతురులా తయారై హాస్పిటల్‌కు చేరింది. కళ్ల ముందు నిలుచుకున్న గ్రేస్‌ను చూసి కార్లోస్ భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రేయసి తనకు దూరం కాదని దగ్గరవుతోందని తెగ సంతోష పడిపోయాడు. అలా వారిద్దకి ఐసీయూలోనే ఆగస్టు 11,2020న వివాహం జరిగింది. కాగా వారి తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి హాజరుకావటానికి హాస్పిటల్ యాజమాన్యం అనుమతినివ్వటంతో ఇరు పెద్దల సమక్షంలో కార్లోస్…గ్రేస్ ఒక్కటయ్యారు.



ఆ తరువాత చిత్రంగా కార్లోస్ చక్కగా కోలుకోవటం ప్రారంభించాడు. అలా క్రమంగా కోలుకుంటున్న కార్లోస్ ECMO నుంచి నార్మల్ ఐసోలేషన్ వార్డుకు మారాడు. చికిత్సకు చక్కగా అతని బాడీ స్పదిస్తోందని..అతని మానసిక ఒత్తిడి తగ్గటమే దీనికికారణమని అంటున్నారు అతనికి చికిత్స చేస్తున్న హాస్పిటల్ సిబ్బంది. ఆగస్టు 15నాటికి కార్లోస్ హాస్పిటల్ లో చేరి నెల అయ్యింది. అతని వివాహం అయి నేటికి 8రోజులైంది. ఇప్పుడతను త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతాడని ట్రీట్ మెంట్ కు అతనిశరీరం సహకరించటమే దీనికి కారణమని అంటున్నారు.