Corona : అమెరికా జూలో గొరిల్లాలకు కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు మనుషులకే పరిమితమైన వైరస్ జంతువులకు కూడా సోకుతోంది. మానవుని నుంచి గొరిల్లాలకు కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది.

Corona : అమెరికా జూలో గొరిల్లాలకు కరోనా

Corona (2)

Corona positive for gorillas : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి జనంతో పాటు మూగజీవాలను వదలడం లేదు. ఇప్పటివరకు మనుషులకే పరిమితమైన వైరస్ జంతువులకు కూడా సోకుతోంది. మనుషుల నుంచి గొరిల్లాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి వైరస్‌ సోకింది.

అమెరికాలో మరోసారి గొరిల్లాలు కరోనా బారిన పడ్డాయి. అట్లాంటా జూలో పలు గొరిల్లాలు కరోనా వైరస్ సోకింది. సంరక్షణలో ఉన్న వెస్ట్రన్‌ లోల్యాండ్‌ గొరిల్లాల్లో కొన్ని స్వల్ప దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లు నిర్వాహకులు గుర్తించారు.

దీంతో వాటి శాంపిల్స్ ను జార్జియా యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జూ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినవాటి సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. పరీక్షల నిమిత్తం జూలోని అన్ని గొరిల్లాల శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపింది.

San Diego Zoo : అమెరికా శాండియాగో జూలో కోవిడ్ కలకలం…ఓ చిరుతకు సోకిన వైరస్

అట్లాంటా జూలో మొత్తం 20 గొరిల్లాలు ఉన్నాయి. వీటిలో 13 గొరిల్లాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ‘అట్లాంటా జర్నల్‌ – కాన్‌స్టిట్యూషన్‌’ పత్రిక తెలిపింది. ప్రతి గుంపులోనూ గొరిల్లాలకు వైరస్‌ సోకినట్లు వెల్లడించింది. వాటి నిర్వహణ చూసే సిబ్బంది ఒకరి నుంచి కరోనా సోకి ఉండొచ్చని పేర్కొంది.

ఇదే ఏడాది జనవరిలో అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కరోనా సోకింది. కరోనా సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని పార్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లిసా పీటర్సన్‌ వెల్లడించారు.

పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్‌ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్‌ అనుమానం వ్యక్తం చేశారు. గొరిల్లాలు కాస్త నలతగా కనిపిస్తూ దగ్గుతూ ఉండడంతో ఒక గొరిల్లాకి పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది.