China Corona Terror : రోజుకు 30వేలకు పైగా కరోనా మరణాలు..! చైనీయులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న హెచ్చరికలు

న్యూ ఇయర్ వేడుకుల తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భారీగా కోవిడ్ మరణాలు ఉంటాయని భావిస్తున్నారు. రోజుక 30వేల మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

China Corona Terror : రోజుకు 30వేలకు పైగా కరోనా మరణాలు..! చైనీయులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న హెచ్చరికలు

China Corona Terror : కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే డ్రాగన్ కంట్రీ చైనాలో కోవిడ్ కల్లోలం ఆగడం లేదు. కొత్త సంవత్సరం వేడుకుల కోసం ప్రజలు భారీగా ప్రయాణాలు చేస్తుండటంతో మరికొన్ని రోజుల పాటు వైరస్ విధ్వంసం కొనసాగుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. రోజుకు 30వేల మందికిపైగా కరోనా బాధితులు మరణించే ప్రమాదం ఉంది అన్న హెచ్చరికలు చైనీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే, దేశ జనాభాలో 80శాతానికి వైరస్ సోకిందని, హెర్డ్ ఇమ్యూనిట వచ్చిందని చైనా అంటువ్యాధుల నిపుణుడు చెబుతుండటం కాస్త ఊరట కలిగించే అంశం.

నెలన్నర రోజులుగా కరోనా ఉత్పాతంతో అల్లాడుతున్న చైనా.. ఇంకా కుదుట పడలేదు. ఇంతలో న్యూ ఇయర్ వేడుకలు వచ్చేశాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసం రెండు వారాలుగా చైనీయులు చేస్తున్న రికార్డు ప్రయాణాలు వైరస్ కేసులను, మరణాలను ఊహించని స్థాయిలో పెంచుతున్నాయి. అయితే, ఫిబ్రవరి చివరి వారం లోపు వైరస్ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నారు.

Also Read..China Covid Deaths : చైనాలో కరోనా టెర్రర్.. భారీగా పెరగనున్న కోవిడ్ మృతుల సంఖ్య, రోజుకు 36వేల మరణాలు..!

2022 డిసెంబర్ మొదటి వారంలో చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ ఎత్తేశాక కరోనా ప్రళయం సృష్టించింది. చైనాలో నమోదైన కేసులు, మరణాలతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయాలు నెలకొన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఉత్పాతం చైనీయులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. మందులు లేక, ఆసుపత్రిలో చికిత్స పొందే సౌకర్యాలు లేక చివరకు మరణిస్తే అంత్యక్రియలకు కూడా చోటు లేక చైనా ప్రజలు మాటలకు అందని వేదన అనుభవిస్తున్నారు.

అయితే ఈ స్థాయిలో కాకపోయినా కరోనా కల్లోలం ఫిబ్రవరి రెండో వారం దాకా కొనసాగుతుందని ఆ తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టి ఫిబ్రవరి చివరి నాటికి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు అంచనా వేశారు. అయితే, ఈ రెండు వారాల్లో మాత్రం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read..China Covid : చైనాలో కోవిడ్ కల్లోలం.. 80శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్, నెల రోజుల్లో 60వేల మరణాలు

జీరో కోవిడ్ విధానం ఎత్తేసిన తర్వాత నెల రోజుల వ్యవధిలో 60వేల మంది కరోనా బాధితులు చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది. నిజానికి కోవిడ్ మరణాల సంఖ్య భారీగా ఉంటుందని, చైనా చెప్పిన లెక్కలు సరైనవి కావని ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. రోజుకు 9వేల మంది కరోనాతో మరణించారని అంచనా కట్టాయి. అంటే నెల రోజల్లో దాదాపు 3లక్షల మంది కోవిడ్ తో మరణించినట్ట.

చైనా జనాభాలో 80శాతం మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా తీవ్రత ఇంకా కంటిన్యూ అవుతోంది. న్యూ ఇయర్ వేడుకుల తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భారీగా కోవిడ్ మరణాలు ఉంటాయని భావిస్తున్నారు. రోజుక 30వేల మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, ఆంక్షలు లేని వాతావరణంలో స్వేచ్చగా సంచరిస్తున్న చైనా ప్రజలు వైరస్ బారిన పడుతున్నప్పటికీ ఈ పరిస్థితుల్లో చైనాలో హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఈ వేవ్ ముగిస్తే చైనాలో కూడా ఇక మిగిలిన దేశాల్లోలానే సాధారణ పరిస్థితులు ఉంటాయని భరోసా ఇస్తున్నారు.