ఆ దేశాలకు పొంచి ఉన్న భారీ ముప్పు, త్వరలోనే కరోనా థర్డ్ వేవ్, ఈసారి మరింత దారుణంగా ఉంటుంది

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 03:35 PM IST
ఆ దేశాలకు పొంచి ఉన్న భారీ ముప్పు, త్వరలోనే కరోనా థర్డ్ వేవ్, ఈసారి మరింత దారుణంగా ఉంటుంది

corona third wave: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపానికి హడలెత్తిపోతున్న యూరోప్‌ దేశాలకు థర్డ్‌ వేవ్‌ ముంపు పొంచి ఉందా..? పరిస్థితి మరింత దారుణంగా మారనుందా..? ఊహించడానికే నమ్మకం కాని రీతిలో యూరోప్‌ను కరోనా అల్లకల్లలోం చేయనుందా..? అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. యూరోప్ దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉందని.. వచ్చే(2021) జనవరి నాటికి పరిస్థితి దీనికి డబుల్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు హెచ్చరించింది.

ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం:
కరోనా మహమ్మారి యూరప్‌ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది చనిపోతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. యూరోప్ దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి.

కరోనా నివారణ చర్యలను మధ్యలోనే ఆపేయడంతో దుష్ఫలితాలు:
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్‌ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని.. అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యూరప్‌లో వచ్చే(2021) ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలయ్యే ప్రమాదముందని చెప్పింది. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వాలు మేల్కొంటే మేలని అభిప్రాయపడింది.
https://10tv.in/amit-shah-launches-covid-rt-pcr-test-at-rs-499-result-in-6-hours/
థర్డ్‌ వేవ్‌ మరింత భీకరంగా ఉంటుంది:
యూరప్‌ దేశాలు కరోనా ఫస్ట్‌ వేవ్‌ను త్వరగానే అధిగమించగలిగాయి. వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్‌ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయి. కరోనాను ఎదుర్కొనేందుకు వేసవి అనుకూల సమయం. అయితే.. కరోనా నిబంధనలను యూరప్‌ ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేశాయి. మౌలిక సదుపాయాలను కూడా విస్మరించాయి. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లోనూ మేల్కోకపోతే థర్డ్‌ వేవ్‌ మరింత భీకరంగా ఉంటుందని WHOతో పాటు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చి.. మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయకపోతే థర్డ్ వేవ్‌ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.