అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ..కౌంట్ డౌన్ స్టార్ట్

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 01:20 PM IST
అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ..కౌంట్ డౌన్ స్టార్ట్

Corona Vaccine Distribution in America : అగ్రరాజ్యాం అమెరికాను గడగడలాడించిన కరోనాకు అంతిమ గడియలు స్టార్ట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో అక్కడ తొలి విడత వ్యాక్సినేషన్ మొదలు కానుంది. కరోనాతో అల్లాడిపోతున్న అమెరికా ప్రజలకు ఇది గొప్ప ఊరట ఇచ్చే విషయం. కరోనా వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పంపిణీ చేయనున్నారు. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు అనుమతి లభించడంతో మిచిగన్‌లోని ఫైజర్ అతిపెద్ద కర్మాగారం నుంచి వ్యాక్సిన్‌ల లోడ్లతో ఫెడెక్స్ ట్రక్కులు బయలుదేరి.. తమ గమ్యానికి చేరుకున్నాయి.

ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణించారు. కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. కరోనాపై పోరాటానికి ఫైజర్‌ టీకా అస్త్రాన్ని అమెరికా ఎంచుకుంది. స్వదేశానికే చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను వినియోగంలోకి రాబోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యాక్సినేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అమెరికా పూర్తి చేసింది.

తొలిదశ షిప్‌మెంట్ బాధ్యతలను ఫెడెక్స్, యూపీఎస్ కంపెనీలకు అమెరికా అప్పగించింది. వ్యాక్సిన్ డోసులతో కూడుకున్న భారీ కంటైనర్లు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఇక ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమం మొత్తాన్నీ అమెరికా ఆర్మీ అధికారులు పర్యవేక్షించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఇది కొనసాగింది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తొలిదశ కింద 30 లక్షల డోసులను పంపిణీ జరిగింది. హెల్త్‌కేర్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్లకు తొలిదశ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి టీకా ఇచ్చిన మూడు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు.

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది. కంటికి కనిపించని శత్రువు దాడిలో అమెరికా చావు దెబ్బ తింది. కరోనా కాటుకు అమెరికాలో గ్రేట్ డిప్రెషన్‌ నాటి కాలం మళ్లి వచ్చినట్లయింది. నిరుద్యోగత రేటు తారాస్థాయికి చేరింది. దీంతో వ్యాక్సిన్‌పైనే అమెరికా బోలేడు అశలు పెట్టుకుంది. దానికి తగ్గట్లుగానే ఫైజర్‌ వ్యాక్సిన్‌ దూసుకొచ్చింది. అమెరికన్లకు ఇది టీకా అస్త్రంగా కనిపించింది. దీంతో అమెరికాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అగ్రరాజ్యం పచ్చజెండా ఊపింది.