Corona Vaccine: కరోనా టీకా వేయించుకోండి.. కోటీశ్వరులు కండి!

Corona Vaccine: కరోనా టీకా వేయించుకోండి.. కోటీశ్వరులు కండి!

Corona Vaccine (2)

Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాయి. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి వ్యాక్సిన్ యొక్క ఉపయోగం గురించి ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక కొన్ని దేశాల్లో అయితే వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతులు ప్రకటిస్తున్నారు.

భారత్ లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సమయంలో గుర్గావ్‌లోని ఒక పబ్ టీకా వేసుకున్న వాళ్లకి మందు ఫ్రీ గా ఇచ్చారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బంగారం ముక్కు పుడకలు, భోజనాలు, పంజాబ్లో అయితే రెస్టారెంట్ లలో డిస్కౌంట్లు ఇచ్చారు.

ఇక ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యాక్సిన్ పై అపోహలు వస్తుండటంతో వ్యాక్సిన్ చేయించుకున్న వారికి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు పలు కొత్త పద్దతులను అవలంబిస్తున్నారు.

వర్జీనియాలోని ఒక కాఫీ షాప్ టీకా వేసుకున్న వారికి $250 కూపన్ లు ఇస్తోంది. ఇజ్రాయెల్ లోని ఓ బార్, కొన్ని దుబాయ్ రెస్టారెంట్లు వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇక ఇప్పుడు అమెరికాలోని యువతకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఒహయో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ రంగంలోకి దిగారు.

అక్కడి ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలోని యువత వాక్సినేషన్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని గుర్తించి వ్యాక్సిన్ వేసుకున్న వారిలో లక్కీ డ్రా లో ఎన్నికైన వారికి వారి ప్రతివారం ఒక మిలియన్ డాలర్ ప్రైజ్ ఇస్తామని ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని తెలిపారు. గవర్నర్ ప్రకటించిన ఈ ఆఫర్ 18 ఏళ్ళు నిండి కనీసం ఒక్క డోస్ తీసుకున్నవారికి వర్తిస్తుంది.

మొదటివారం విజేతను మే 26న ప్రకటించనున్నారు. ఇక 17 ఏళ్లలోపు వారికీ నేరుగా డబ్బు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వారి చదువు కోసం స్కాలర్ షిప్ రూపంలో వారు చదువుతున్న కళాశాలలకు డబ్బు ఇవ్వడం జరుగుతుందని గవర్నర్ ప్రకటించారు