కరోనా ఎఫెక్ట్ : యాపిల్‌కు దెబ్బ

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 03:29 AM IST
కరోనా ఎఫెక్ట్ : యాపిల్‌కు దెబ్బ

కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడిపోతోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచాన్ని చైనా వైరస్ వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వృద్ధి భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. వెంటనే వ్యాక్సిన్ కనుగొనకోకపోతే..తంటాలే అంటున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు.

భారత దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే..కరోనా…టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్‌నూ వెంటాడుతోంది. వైరస్ ఎక్కడైతే మొదలైందో..ఆ వుహాన్ నగరంలో యాపిల్ ఫోన్ల కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్ కాన్‌కు అతి సమీపంలో ప్లాంట్ ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా..సెలవులపై తైవాన్ ఇతరత్రా దేశాలకు వెళ్లిన వారు..ఇప్పుడిప్పుడే వెనక్కి రావొద్దని ఫాక్స్ కాన్ హెచ్చరించింది. కొద్ది రోజుల పాటు..ఇక్కడి ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోకినుంది. 

యాపిల్ ఉత్పత్తుల తయారీపై చైనాలో సుమారు..50 లక్షల ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని అంచనా. యాపిల్‌కు సొంత సిబ్బందే చైనాలో 10 వేల మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్‌కు పరిష్కారం లభించకపోతే..మాత్రం..ప్లాంట్ల మూసివేతతో తీవ్ర నష్టమే జరుగుతుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఐ ఫోన్ అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌‌గా ఉన్న చైనాలో రిటైల్ సేల్స్ పడిపోవచ్చని అంటున్నారు. తమ ప్రజలు చైనాకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం సహా అనేక కంపెనీలు ట్రావెల్ అలెర్ట్‌ను కూడా ప్రకటించాయి. 

Read More :శివ..శివ..చలి పారిపోయిందా : జనవరిలోనే ఎండలు