కరోనా కల్లోలం : చైనాలో మరిన్ని ఆంక్షలు.. గడప దాటొద్దని 60లక్షల మంది ప్రజలకు ఆదేశం

కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 02:17 AM IST
కరోనా కల్లోలం : చైనాలో మరిన్ని ఆంక్షలు.. గడప దాటొద్దని 60లక్షల మంది ప్రజలకు ఆదేశం

కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా

కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా రోజురోజుకి అధికమవుతోంది. చైనాలోని హుబెయ్ ప్రావిన్స్(hubei province) లో కరోనా వైరస్(corona virus) ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు. ప్రజల కదలికలను కట్టడి చేశారు. ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. గడప దాటి బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దన్నారు. ప్రైవేట్ కార్ల వాడకంపైనా అధికారులు నిషేధం విధించారు. ప్రజలెవరూ ఎటూ వెళ్లొద్దని ఆర్డర్ చేశారు.

ముందు జాగ్రత్తతోనే ఈ ఆంక్షలు, ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పౌరుల భద్రత కోసమే చర్యలు చేపట్టామని వివరించింది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. జాగ్రత్తగా ఉండటం మంచిదని అధికారులు చెప్పారు. హుబెయ్ ఫ్రావిన్స్ లో 60లక్షల మంది ప్రజలు ఉంటారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని తేల్చి చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

కొవిడ్‌-19 వైరస్‌(covid-19) చాలా వేగంగా వ్యాపిస్తోంది. కేవలం నెలన్నర వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 69వేల మందికి సోకింది. అందులో 68వేల 500 మంది బాధితులు ఒక్క చైనాలోనే ఉన్నారు. మిగతా 500 మంది 28 దేశాలకు చెందినవారు. ఆ 500 మందిలో 355 మంది జపాన్‌ తీరంలో నిలిచి ఉన్న ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలోని(diamond princess cruise) వారే. క్వారంటైన్‌గా మార్చిన ఆ నౌకలో తాజాగా మరో ఇద్దరు భారతీయులకు కొవిడ్ వైరస్‌ సోకింది. దీంతో 138 మంది భారతీయులున్న ఆ నౌకలో ఇప్పటిదాకా ఐదుగురు ఆ వైరస్‌ బారిన పడినట్టయింది. నౌకలో ఉన్న భారతీయుల్లో.. కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినవాందరినీ మనదేశానికి చేర్చడానికి అవసరమైన సాయం చేస్తామని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

చైనాలో ఇప్పటిదాకా 1665 మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం వూహాన్‌(wuhan) నుంచి భారత్‌కు తరలించి ఐటీబీపీ క్వారంటైన్‌లో ఉంచి 406 మంది భారతీయులకూ కొవిడ్‌-19 పరీక్ష నెగెటివ్‌ వచ్చింది.