కరోనా.. అమెరికా వైద్యుల ప్రయోగం :  రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన మహిళ

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 08:43 AM IST
కరోనా.. అమెరికా వైద్యుల ప్రయోగం :  రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన మహిళ

కరోనా వైరస్ రాకాసికి అగ్రరాజ్యం తల్లడిల్లుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువ కాకుండా..ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. వేల మంది బలవతున్నారు. ఈ క్రమంలో..వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. సీటెల్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి కూడా. కరోనా వైరస్ ను జయించిన న్యూయార్క్ కి చెందిన టిఫానీ పింక్నే తన రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడం ప్రతొక్కరూ అభినందిస్తున్నారు.

ప్రయోగాలకు సిద్ధమైన తొలి వ్యక్తిగా ఈమె నిలిచారు. తాను ఈ వైరస్ కారణంగా మృత్యు ముఖం దాక వెళ్లొచ్చానని, ఇలాంటి చేదు అనుభవాలు ఇంకెవరికి ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జురిగిందని పింక్నే వెల్లడించారు. (బెడ్ షీట్ల సాయంతో పారిపోవడానికి ప్రయత్నించిన కరోనా పేషెంట్)

అసలు ఏంటా ప్రయోగం ? ఎలా చేస్తారు ? 

1918లో ఫ్లూను అరికట్టేందుకు కన్వాల్సెంట్  సీరం పద్ధతి అవలింబించారు. దీనిని ప్రస్తుతం మరోసారి ప్రయోగించాలని నిర్ణయించారు. కరోనా బాడి కోలుకున్న వారి రక్తాన్ని సేకరించి ప్రయోగాలు చేపడుతోంది. రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తారు. ఇందులో వ్యాధి నిరోధక పరమాణువులను గుర్తిస్తారు. వీటి పనితీరును సమీక్షిస్తారు. వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే అంశాలను పరిశీలిస్తారు.

వైరస్ తీవ్రతను తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని మాయో క్లినిక్ పరిశోధకులు వెల్లడించారు. ఫ్లాస్మా సేకరించడం, పంపిణీ చేసే బాధ్యతను అమెరికా రెడ్ క్రాస్ సంస్థ తీసుకుందని తెలిపారు.  టిఫాన్నీ పింక్నే ముందుకు వచ్చారు. తన రక్తంలో ఇందుకు సమాధానం దొరుకుతుందంటే ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. పింక్నే కరోనా నుంచి కోలుకున్నారని, ఇతరులకు సాయం చేసేందుకు తన రక్తాన్ని దానం చేస్తున్నారని మౌంట్ సినాయి ఆసుపత్రి అధ్యక్షుడు డేవిడ్ కితాబిచ్చారు.