Covid-19 Pandemic: బాబోయ్..! కోవిడ్-19 మహమ్మారి యువత మెదళ్లను వేగంగా వృద్ధాప్యం దశకు మార్చేస్తుందా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..?

కొవిడ్ -19 మహమ్మారి మానవ జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్భా రినపడిన వారిలో అనేక రుగ్మతలు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. చాలా మందిలో కొత్త అనారోగ్య సమస్యలను మహమ్మారి వైరస్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యువతలో ఈ మహమ్మారి వల్ల కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Covid-19 Pandemic: బాబోయ్..! కోవిడ్-19 మహమ్మారి యువత మెదళ్లను వేగంగా వృద్ధాప్యం దశకు మార్చేస్తుందా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..?

Covid-19 Pandemic

Covid-19 Pandemic: కొవిడ్ -19 మహమ్మారి మానవ జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్భా రినపడిన వారిలో అనేక రుగ్మతలు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. చాలా మందిలో కొత్త అనారోగ్య సమస్యలను మహమ్మారి వైరస్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యువతలో ఈ మహమ్మారి వల్ల కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందన్న విషయాన్ని గతంలోనే పరిశోధకులు వెల్లడించారు. తాజాగా అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

China Corona Fears : వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్లకు భారీగా పెరిగిన డిమాండ్.. చైనాలో కరోనా టెర్రర్

అమెరికా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా జరిపిన పరిశోధన వివరాలను ‘బయోలాజికల్ సైకియాట్రి గ్లోబల్ ఓపెన్ సైన్స్’ అనే పత్రిక వెల్లడించింది. ఈ పరిశోధనల ప్రకారం.. 16ఏళ్ల వయసులో ఉండే కుర్రాడు తన వయసుకు తగినట్లుకాకుండా ఏడు పదుల వృద్ధుడిలా ప్రవర్తించడం, మతిమరుపు రావడం లాంటివి గమనించారు. ఈ పాపం మొత్తం కొవిడ్ మహమ్మారిదేనని శాస్త్రవేత్తల తేల్చారు. టీనేజీ మొదలైనప్పుడు మెదడులో జ్ఞాపకాలు, భావోద్వేగాలను నియంత్రించే హిప్పోక్యాంపస్, ఎమిగ్దలా అనే రెండు ప్రాంతాలు పెరుగుతాయి. హిప్పోకాంపస్ అనేది ఒక క్లిష్టమైన మెదడు నిర్మాణం, ఇది నేర్చుకోవడంలో, జ్ఞాపకశక్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమిగ్డాలా భావోద్వేగ ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటుంది. అదే సమయంలో కార్యనిర్వాహక సామర్థ్యానికి సంబంధించిన కార్టెక్స్ లోని కణజాలం సన్నబడుతుంది. పరిశోధనలో భాగంగా కొవిడ్ కు ముందు, తర్వాత 163 మంది పిల్లల ఎంఆర్ఐ స్కాన్లను పరిశీలిస్తే కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఈ వృద్ధి బాగా వేగవంతమైనట్లు తెలిసింది.

China Corona Cases : ఒక్కరోజే 33వేల కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ విశ్వరూపం

సాధారణంగా పిల్లలు హింసకు, నిర్లక్ష్యానికి గురైనా, కుటుంబంలో కలతల్లాంటివి ఎదురైనా వాళ్ల మెదడు వయసు పెరుగుతుంది. అలాంటివేమీ లేకుండా కొవిడ్ సమయంలో వాళ్ల శారీరక వయసుకంటే మానసిక వయసు కొన్ని రెట్లు పెరిగినట్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యూరో డెవలప్మెంట్, ఎఫెక్ట్ అండ్ సైకోపాథాలజీ (స్నాప్) ల్యాబ్ డైరెక్టర్ ఇయాన్ గోట్లిబ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ ఆప్ కనెక్టికట్ కు చెందిన జొనాస్ మిల్లర్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి యువతకు గణనీయమైన ఒత్తిడి, అంతరాయం కలిగించిందని అధ్యయనం తెలిపింది. ఇది వారి మానసిక ఆరోగ్యం, న్యూరో డెవలప్‌మెంట్‌లో మార్పులకు దారితీసింది. సాధారణంగా.. 70-80 సంవత్సరాల వయస్సులో జ్ఞాపకశక్తికి చెందిన సమస్యలు వస్తాయి. కానీ 16ఏళ్ల వయస్సులోనే అవి వస్తే..? అని ఆయన వివరించారు. ప్రస్తుత యువతరానికి రాబోయేరోజుల్లో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండొచ్చని ఆయన అన్నారు.