Covid-19: కరోనా 25 వేల ఏళ్ల క్రితమే పుట్టింది – అరిజోనా వర్సిటీ

ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఈ వైరస్ ఇప్పటిది కాదని తేలిందట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్ మనుషులకు సోకిందట.

Covid-19: కరోనా 25 వేల ఏళ్ల క్రితమే పుట్టింది – అరిజోనా వర్సిటీ

Covid 19 (3)

Covid-19: ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఈ వైరస్ ఇప్పటిది కాదని తేలిందట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్ మనుషులకు సోకిందట. ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఎనార్డ్‌ ఆధ్వర్యంలో అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. ఇటీవలే నివేదిక విడుదల చేశారు. ఇందులో అనేక విషయాలను పొందుపరిచారు.

మానవుడు పుట్టిన నాటి నుంచి వైరస్ లతో పోరాడుతూనే ఉన్నాడని పరిశోధకులు తేల్చారు. వైరస్ లు విజృంభించినప్పుడలా కొందరు వాటిని తట్టుకుని జీవించగలిగారు. అలాంటి వారిలో వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యానికి కారణమైన జన్యువులు తర్వాతి తరాలకు అందుతూ, మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఆలా మానవుడు వైరస్ లను ఎదురుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇక అరిజోనా వర్సిటీ పరిశోధనల్లో తూర్పు ఆసియా దేశాల వారు కరోనాను సమర్ధవంతంగా ఎదురుకుంటున్నారని తేల్చారు. ప్రపంచంలోని ఇతర ఖండాల వారితో పోల్చితే కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి ఈ దేశాల వారిలోనే ఉందని పేర్కొన్నారు. ఇక తూర్పు ఆసియా దేశాలు అంటే.. ఆసియా ఖండంలోని చైనా, జపాన్, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాలను తూర్పు ఆసియా దేశాలుగా పేర్కొంటారు.

ఇక వాటికి సమీపంగా ఉన్న దేశాలను చూస్తే నేపాల్, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాలు ఉంటాయి. 26 ప్రాంతాల నుంచి 2,504 మంది జన్యుక్రమంపై పరిశోధన చేసిన అరిజోనా శాస్త్రవేత్తలు ఈ విషయం తెలిపారు.