కర్ఫ్యూని ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన 400మంది అరెస్ట్

అవును నిజమే. కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన 400మంది పౌరులను అరెస్ట్ చేశారు. షాకింగ్ గా ఉన్నా నమ్మాల్సిందే. అయితే మన దేశంలో కాదు లెండి.

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 07:02 AM IST
కర్ఫ్యూని ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన 400మంది అరెస్ట్

అవును నిజమే. కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన 400మంది పౌరులను అరెస్ట్ చేశారు. షాకింగ్ గా ఉన్నా నమ్మాల్సిందే. అయితే మన దేశంలో కాదు లెండి.

అవును నిజమే. కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన 400మంది పౌరులను అరెస్ట్ చేశారు. షాకింగ్ గా ఉన్నా నమ్మాల్సిందే. అయితే మన దేశంలో కాదు లెండి. జోరాన్(jordan) లో. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జోర్డాన్ లో కర్ఫ్యూ విధించారు శనివారం(మార్చి 21,2020) నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశాలు ఇచ్చారు. అయితే నిత్యావసరాల కొనుగోలు కోసం, ఆహారం కొనుక్కునేందుకు కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చారని 400మంది పౌరులను అరెస్ట్ చేశారు.

ఇప్పటికే జోర్డాన్ లో అన్ని రకాల వ్యాపారాలు మూసివేశారు. మాల్స్, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు మూసేశారు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చారంటే వారు శిక్షకు అర్హులు అని ప్రభుత్వం హెచ్చరించింది. ఆహారం, నిత్యావసరాల కొనుగోలు కోసం మంగళవారం(మార్చి 24,2020) నూతన విధానం ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు.

జోర్డాన్ దేశంలో 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మర్చారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు, ఆంక్షలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. జోర్డాన్ లో మార్చి నెలలో వాతావరణం చల్లగా ఉంటుంది. గ్యాస్ సిలండర్లకు భారీగా డిమాండ్ ఉంటుంది.

నగరాలు, ప్రధాన హైవేలపై వేల సంఖ్యలో సైనికులను మోహరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారంగా గస్తీ కాస్తున్నారు. శరణార్థుల జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో జోర్డాన్ ఒకటి. 6లక్షల సిరియన్లు జోర్డాన్ లో ఉంటున్నారు.