చైనాలో మాస్క్‌లు తప్పనిసరి కాదట

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 11:28 AM IST
చైనాలో మాస్క్‌లు తప్పనిసరి కాదట

బయట తిరిగే సమయంలో మాస్క్ లు తప్పనిసరి కాదంటోంది చైనా రాజధాని బీజింగ్. చైనాలో మాస్క్ లు లేకుండా తిరగొచ్చని చెప్తున్న సిటీ ఇదే కాబోలు. COVID-19 మహమ్మారిని నియంత్రించడంలో చైనా సక్సెస్ అయిందని చెప్పడానికి ఇదొక సిగ్నల్ అంట. 

ఇన్ఫెక్షన్ రిస్క్‌ల నుంచి తప్పించుకునేందుకు నెలల తరబడి మాస్క్ లు ధరించిన తర్వాత స్వచ్ఛమైన గాలిని మాస్క్‌లు లేకుండా స్వేచ్ఛగా పీల్చుకోండి. అని బీజింగ్ చెప్పినట్లు చైనా మీడియా చెప్పింది. జబ్బుకు ముందస్తు జాగ్రత్తగా చెప్పిన సూచనల్లో కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించింది బీజింగ్. 

కేంద్రం ఒకటే చెప్తుంది. బటయ పరిసరాల్లో మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పింది. కానీ, ఇతరులతో క్లోజ్ గా తిరగడాన్ని మాత్రం ఇంకా అలాగే ఉంచింది. చైనా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ అనౌన్స్‌మెంట్ చేసింది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ). మే22 వరకూ వార్షిక సమావేశాలను వాయిదా వేశారు. 

ఆదివారం చైనాలో కొత్తగా 17కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 12 వూహాన్ తో సంబంధం ఉన్న ఇన్ఫెక్షన్సేనని చెప్పారు. శనివారానికి చైనాలో 82వేల 947కేసులు నమోదు అయ్యాయి. 86మంది ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. 78వేల 227 మంది రికవరీ అయి డిశ్చార్జ్ అయ్యారు. బీజింగ్ లో మాత్రం 593కేసులు మాత్రమే నమోదుకాగా, 9మంది చనిపోయారు.