చైనా వెళ్తేనే కాదు..ఎక్కడకైనా వైరస్ సోకగలదా..?

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 01:28 PM IST
చైనా వెళ్తేనే కాదు..ఎక్కడకైనా వైరస్ సోకగలదా..?

కోవిడ్ 19 (కరోనా) వైరస్‌ ఎక్కడకైనా..ఎలాగైనా వ్యాపించగలదు. అందులోనూ గాలిలో వ్యాపించే శక్తి కరోనాకి ఉండటంతో వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లిన వారితో పాటు..ఇతర రూపాల్లో కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని మహిళకు సోకడంతో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎయిర్ పోర్టులు..రెస్టారెంట్ల యజమానులు అప్రమత్తమయ్యారు. ఒక్క చైనాలోనే 82 వేల మందికి కోవిడ్ 19 సోకగా 2 వేల 800మంది పిట్టల్లా రాలిపోయారు.

చైనాలో కాస్త తగ్గిందనుకున్న కోవిడ్ 19 వైరస్ తాజాగా సౌత్ కొరియాలో తన ప్రతాపం చూపిస్తోంది. ఇరాన్, ఇరాక్, ఇటలీలో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అమెరికాలోనూ వైరస్ బ్రేకవుట్ అవడంతో.. కాలిఫోర్నియా ఆరోగ్య సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కాలిఫోర్నియాలో వైరస్ కలకలంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది దాదాపు 8 వేల 400 మందిని మానిటర్ చేస్తున్నారు.

వీరిందరికి కూడా కరోనా టెస్టులు చేయాల్సి ఉండగా మెడికల్ కిట్స్ సరిపోయినన్ని లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. కేవలం 200 కిట్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండగా వీరందరికీ టెస్ట్ చేయాలంటే కనీసం 4 రోజులు పడుతుందని అంచనా. రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ 19 కిట్లను సరఫరా చేయబోతున్నట్లు ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిలో 33మందికి కరోనా పాజిటివ్ లక్షణాలను కనుక్కున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఇతర దేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ముందు చెప్పుకున్న మహిళకి మాత్రమే ఎక్కడకూ వెళ్లకపోయినా కూడా కరోనా సోకడం అమెరికా వాసులను ఆందోళనకు గురి చేస్తోన్న అంశం. ఇప్పుడు ఈ మహిళ చుట్టుపక్కల ఎవరెవరు నివసిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటనే అంశం యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కనుక్కునే పనిలోపడింది. వీరందరినీ కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయబోతున్నారు. 

Read More : వయస్సుతో పనేముంది : ప్రియాంక వయస్సు 37..అయితే – నిక్ జోనస్