చైనాలో కరోనా మృత్యు ఘంటికలు : ఒక్కరోజే 97మంది మృతి..!!

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 03:09 AM IST
చైనాలో కరోనా మృత్యు ఘంటికలు : ఒక్కరోజే 97మంది మృతి..!!

చైనా కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 11.2020) ఏకంగా 97మంది కరోనా వైరస్ కు బలైపోయారు. కాగా..చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 1115మందికి కరోనా వైరస్ కు బలై ప్రాణాలు కోల్పోయారు.  అలాగే 45,170 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8216మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. దీంతో కరోనా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా సోకి 1113 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. మరో 44,653 కేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు ఏకంగా 97మంది కరోనా బాధితులు మృతి చెందారు. రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకూ 28 దేశాలకు విస్తరించినట్లుగా తెలుస్తోంది. దీంతో కరోనా అనే మాట వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 1113 ప్రాణాలు పోయాయి. దాదాపు 43వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు.

మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా వైరస్ గురించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వీలైనంత త్వరగా కరోనాను కంట్రోల్ చెయ్యలేకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80శాతం మంది జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని హాంకాంగ్ కు చెందిన పబ్లిక్ హెల్త్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.