కరోనాపై గెలిచి, మిగిలిన దేశాలకు సాయానికి చైనా రెడీ

పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 01:49 PM IST
కరోనాపై గెలిచి, మిగిలిన దేశాలకు సాయానికి చైనా రెడీ

పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి.

పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి. బుధవారం నాడు మరణాలు 38 మాత్రమే. మిగిలిన దేశాల్లో మాత్రం మరణాల సంఖ్య దాదాపు మూడింతలు. చైనా కాకుండా మిగిలిన ప్రపంచమంతటా 86 మంది చనిపోయారు. అమెరికా, ఇరాన్, దక్షిణకొరియా, ఇటలీలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 95,000 మందికి కరోనా సోకింది. 3,286 మందిని బలి తీసుకుంది. ఇందులో చైనాలో బాధితులు 80,000 మందైతే, మరణాలు మాత్రం 2,900. బుధవారం మాత్రం కొత్తగా 119 కేసులు మాత్రమే నమోదైయ్యాయి. ఇందులో Hubei రాష్ట్రం నుంచే ఎక్కువ. కరోనాకు ఇదే కేంద్రం. మిగిలిన ప్రాంతాల్లో కొత్తగా ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. చైనా ఆర్ధిక రాజధాని షాంగైలో ఆరు రోజుల్లో ఒక్క కేసు మాత్రమే వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

నిర్బంధమే అసలు మంత్రం 
కరోనా వచ్చిందనగానే మొదట బుకాయించిన చైనా ఆ తర్వాత Hubeiరాష్ట్రాన్నే దిగ్బంధించింది. వుహాన్ సిటీ నుంచి ఒక్కపురుగునూ బైటకుపోకుండా దిగ్బంధించింది. చాలామంది హేయమన్నా చైనా పట్టించుకోలేదు. కరోనా సరిహద్దులు దాటకూడదని పట్టుపట్టింది. దానికోసం ఏకంగా తన ప్రజలనే బలిచేయడానికీ సిద్ధపడింది. కఠువుగా ఉన్నా… ఈ పద్ధతి కరోనా నుంచి చైనాను కాపాడుతున్నట్లే కనిపిస్తోంది. వైరల్ వ్యాధుల నిపుణుడు చైనా విధానం సరైనదేనని అన్నాడు.

‘‘చైనా తీసుకున్న కఠిన చర్యల వల్లే తొలి దశ వ్యాధి వ్యాప్తి దాదాపు ఆగిపోయిందని స్పష్టంగానే తెలుస్తోంది’’
 Dr Benjamin Cowling,Hong Kong University

ఈ చైనా పాఠాలను మిగిలిన దేశాలు తొందరగానే అర్థం చేసుకున్నాయి. జపాన్ ఏకంగా క్రూయిజ్ షిప్ నుంచి ఒక్కరినీ బైటకు రానివ్వలేదు. ఆస్ట్రేలియా ఏకంగా ఒంటరి దీవిలోకి అనుమానితులను తీసుకెళ్లి, అక్కడే చికిత్స చేస్తోంది. కొరియా కూడా అంతే. ఇండియా సరిహద్దులను మూసేసింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వాళ్లను వార్డుల్లో నిర్బంధిస్తోంది.  కరోనాను ఎలా కట్టడిచేయాలి? ఏం మందులు వాడొచ్చంటూ చైనా సలహాలను తీసుకొంటున్నారని Vice Foreign Minister, Ma Zhaoxu అంటున్నారు.

పదిరోజుల్లోనే హాస్పిటల్ కట్టి ఔరా అనిపించిన చైనా, ఆఖరు పేషెంట్ కూడా డిశ్చార్జ్  చేయడంతో క్లోజ్ చేసింది. మిగిలిన దేశాలకు ధైర్యమిచ్చే వార్త ఇది. చైనాలో తగ్గినా, మిగిలిన దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది కరోనా. అమెరికాలో కరోనా సోకిన వాళ్ల సంఖ్య ఒక్కవారంలోనే 106కు పెరిగింది. బ్రిటన్ పరిస్థితి కూడా అదే. బుధవారం ఒక్కరోజే 85 మంది పేషెంట్లు తయారైయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు రావడంతో చైనా అధికారులు మిగిలిన చోట్లా కరోనాను అడ్డుకోవడానికి బయలుదేరారు.