కరోనా ఎఫెక్ట్ : చైనాలో చిత్ర విచిత్రాల మాస్క్ లు చూడండీ..

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 06:32 AM IST
కరోనా ఎఫెక్ట్ : చైనాలో చిత్ర విచిత్రాల మాస్క్ లు చూడండీ..

కరోనా వైరస్ భయంతో చైనాలో మాస్క్ లకు ఫుడ్ డిమాండ్ ఏర్పడింది. మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా ఉంది.  దీంతో చైనీలు తమదైన శైలిలో ఇంట్లో ఉండేవాటితో మాస్క్ లు తయారు చేసేసుకుంటున్నారు. వాటిని పెట్టుకుంటున్నారు. ఈ మాస్క్ లు చూస్తే భలే విచిత్రంగా..విభిన్నంగా..సృజనాత్మకంగా  కనిపిస్తు..దటీజ్ చైనీయులు అనేలా ఉన్నాయి. ఈ మాస్క్ లు చూస్తే కరోనా వైరస్ సోకిన చైనీయుల బాధలు ఒకవైపు గుర్తుకొస్తున్నాయి. మరోవైపు వారి వినూత్న ఆలోచనలతో తయారు చేసుకుని వినియోగిస్తున్న వారి మాస్క్ లు చూస్తే భలే భలే మాస్క్ లు అనిపిస్తున్నాయి. 

coronavirus mask

వీరు తయారు చేసుకున్న మాస్క్ లు..మహిళలు ధరించే ‘బ్రా’లను రెండుగా కత్తిరించి ఉపయోగిస్తున్నారు. కప్పు ఆకారంలో ఉండటం వల్ల అవి ముక్కు, నోళ్లను మూయడానికి సరిగ్గా సరిపోతున్నాయని అంటున్నారు చైనీయులు. దీంతో బ్రాలకు కూడా డిమాండ్ పెరిగింది. అంతేకాదంబోయ్..ఇంకొందరు డైపర్లు, శానిటరీ నాప్కిన్‌, నిమ్మ లేదా నారింజ తొక్కలు,5 లీటర్ల వాటర్ అండ్ ఆయిల్ బాటిల్స్ లను మాస్కులుగా ధరిస్తున్నారు. ఆ ‘చిత్ర విచిత్రాల మాస్క్ లను చూడండి.

coronavirus mask

ఈ మాస్క్ లు సోషల్ మీడియాలో వైరస్ గా మారాయి.

కాగా..కరోనా వైరస్ సోకి..చైనాలో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలకు బయట అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. 17 దేశాల్లో ఇప్పటివరకు కరోనా సోకి 213 మంది మరణించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఎమర్జన్సీని ప్రకటించింది. ప్రపంచం వ్యాప్తంగా 10 వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

coronavirus mask