రియల్ హీరో : పెళ్లి వాయిదా వేసుకుని కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ వరుడు మృతి

కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్

  • Published By: veegamteam ,Published On : February 23, 2020 / 04:44 AM IST
రియల్ హీరో : పెళ్లి వాయిదా వేసుకుని కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ వరుడు మృతి

కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్

కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్ ను బలితీసుకుంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తన పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న ఓ డాక్టర్.. బాధితులకు చికిత్స అందిస్తూ.. కరోనా వైరస్ సోకి చనిపోయాడు. ఈ విషాదం చైనాలో(china) జరిగింది. 

పెంగ్ ఇన్ హా(29).. వూహాన్(wuhan) నగరంలోని ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పెంగ్ కి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. అయినా ఆయన సెలవు పెట్టలేదు. కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి చికిత్స అందించేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న క్రమంలో.. డాక్టర్ పెంగ్ కి కరోనా సోకింది. జనవరి 25న ఈ విషయం తెలిసింది. డాక్టర్ పెంగ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ చనిపోయారు. దీంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. పెంగ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వధువు ఇంట్లోనూ విషాదం అలుముకుంది.

డాక్టర్ పెంగ్.. చైనీస్ న్యూ ఇయర్ హాలీడే రోజున పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేయించారు. బంధువులకు, ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి అందరికి వెడ్డింగ్ ఇన్విటేషన్లు ఇచ్చారు. తప్పకుండా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఇంతలో కరోనా విజృంభించింది. కరోనా బాధితులకు చికిత్స అందించాల్సిన కర్తవ్యం తనపై ఉందన్న పెంగ్.. తల్లిదండ్రులను, అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. తన పెళ్లిని వాయిదా వేశారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఓ డాక్టర్ గా ఎంతో ఉన్నతంగా ఆలోచన చేసిన పెంగ్.. చివరికి కరోనా వైరస్ తో మరణించడం అందరిని తీవ్రంగా బాధించింది.

డాక్టర్ పెంగ్ త్యాగాన్ని కీర్తిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. డాక్టర్ పెంగ్ రియల్ హీరో అని పొగుడుతున్నారు. మీ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోము, మీ నిస్వార్థ సేవకు థ్యాంక్స్.. అని పోస్టులు పెడుతున్నారు.

కరోనా వైరస్‌.. చైనాలో పుట్టి ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఇప్పుడీ అంటువ్యాధి మనుషుల్నేగాక.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కబళించేస్తోంది. గ్లోబల్‌ ఎకానమీకి తయారీ కేంద్రంగా విరాజిల్లుతున్న చైనా.. ప్రస్తుతం కరోనా (కోవిడ్‌-19) పడగ నీడలో బిక్కుబిక్కుమంటోంది. ఈ పరిణామం భారత్‌సహా ప్రపంచ వృద్ధి చోదక దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుండగా, అంతర్జాతీయ వృద్ధిరేటు ప్రమాదంలో పడింది. కరోనా వైరస్‌ ధాటికి చైనా విలవిలలాడిపోతోంది. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 2,200లపైనే. బాధితులు సుమారు 76 వేలుగా ఉన్నారు. ఈ అంటువ్యాధిని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలనే చేస్తుండగా, జనజీవనం స్తంభించిపోయింది. చైనా కేంద్రంగా ప్రపంచ మార్కెట్‌ను నడిపిస్తున్న సంస్థలన్నీ మూతబడగా, ఉత్పాదక రేటు దాదాపు జీరో స్థాయికి పడిపోయింది. 

2002-03 కాలంలో భయపెట్టిన సార్స్‌ వ్యాధి కంటే కరోనా వైరస్‌ చేస్తున్న ప్రాణ, ఆర్థిక విధ్వంసం చాలా ఎక్కువ. నాడు 37 దేశాలను వణికించిన సార్స్‌.. 8 వేల మందికిపైగా సోకగా, దాదాపు 750 మందిని బలి తీసుకుంది. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం కూడా పరిమిత స్థాయిలోనే ఉన్నది. 30 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల మధ్యే ప్రభావం ఉండొచ్చని అంచనా. నాడు గ్లోబల్‌ ఎకానమీ విలువ దాదాపు 35 లక్షల కోట్ల డాలర్లే. కానీ ఇప్పుడు అమెరికా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థల విలువే ఇంతున్నది. దీంతో ప్రపంచ జీడీపీపై కరోనా పంజా గట్టిగానే విసురుతోంది. ఇక సార్స్‌ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పటికే 2వేల మందిని పొట్టనబెట్టుకుంది.