బ్రిటన్‌లో సగం మందికి కరోనా వస్తుందట, భయపెట్టే వైద్యనిపుణుల అంచనాలు

బ్రిటన్‌లో సగం మందికి కరోనా వస్తుందట, భయపెట్టే వైద్యనిపుణుల అంచనాలు

కరోనావైరస్.. దాదాపు 7కోట్ల మంది జనాభా ఉన్న లండన్ లో సగం మందికి సోకే ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని థియరిటికల్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ సునేత్రా గుప్తా అంటున్నారు. మంగళవారం ఒక్కరోజే 87మంది చనిపోవడంతో నిపుణుల వాదన బయటికొచ్చింది. దేశవ్యాప్తంగా వెయ్యి 427 మందికి వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. 

జనవరి నెల మధ్య నుంచి కరోనా ప్రభావం ఉన్నట్లు కొత్తగా చేసిన సర్వేలో వెల్లడైంది. అక్కడ తొలి కేసు నమోదుకావడానికి ముందే రెండు వారాల ముందు నుంచే వైరస్ అటాక్ అయింది. ధైర్యంగా ఉండటానికి ఒకే ఒక్క కారణం ఏమంటే వైరస్ బాధితులకు ట్రీట్ చేయడానికి సరిపడ వైద్య సదుపాయం అందించే హాస్పిటళ్లు ఉండటం. లక్షణాలు ఉన్నవారందరికీ చికిత్స అందించగలుగుతున్నారు. 

వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆక్స్‌ఫర్డ్ రీసెర్చర్లు కొత్త టెక్నిక్ వాడుతున్నారు. అయితే దానిని ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేయడంతో పాటు గుర్తు పట్టలేని నీరసం ఉంటే కరోనాగా గుర్తించొచ్చని ప్లాన్ చేశారు. దీని సహాయంతో కరోనాను అడ్డుకోవచ్చని ప్లాన్ చేశారు. షట్ డౌన్ సమయంలో టెస్టులు కన్ఫార్మ్ అయితే ఇతరులకు సోకకుండా నియంత్రించగలం. 

యూకేలో 90వేల మందికి కొవిడ్-19 టెస్టులు చేసేసరికి 82వేల 359మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. యూకేలో 386 కరోనా మృతులు సంభవించాయి. వీరిలో 33ఏళ్ల నుంచి 103సంవత్సరాల వయస్సుల వారు ఉన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 

See Also | దేశమంతా లాక్ డౌన్: SBI కీలక ప్రకటన.. పని చేస్తాం.. కానీ!