వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదు..జాగ్రత్తలుతీసుకుంటూ దాంతో కలిసి బతకాల్సిందే

  • Published By: nagamani ,Published On : May 29, 2020 / 05:48 AM IST
వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదు..జాగ్రత్తలుతీసుకుంటూ దాంతో కలిసి బతకాల్సిందే

కరోనా వైరస్‌ ఎక్కడికీ పోదు. టీకా వచ్చినా మన మధ్యనే ఉంటుంది. దానితో కలిసి జీవించాల్సిందే. తప్పదు. కానీ..కరోనా వైరస్ సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా జీవించాలన్నదే మనం ఇప్పుడు ఆలోచించాలని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు సారా కోబే తెలిపారు.

స్మాల్‌పాక్స్‌,చికెన్ పాక్స్ వంటివాటికి వ్యాక్సిన్ వచ్చినా ఇప్పటికీ వాటి మనుగడ కొనసాగుతూనే ఉంది. అలాగే కరోనా వైరస్ కు కూడా వ్యాక్సిన్ వచ్చినా అది శాశ్వతంగా పోదని తెలిపారు. స్మాల్ పాక్స్ కు టీకా కనుగొని 200 ఏండ్లు గడిచినా అది ఇంకా ఉనికిలోనే ఉన్నది. దాని మనుగడ సాగిస్తూనే ఉంది. కానీ..కరోనాపై పోరుకు దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. అన్ని దేశాలు కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కరోనా మరింతగా మనుష్యుల్లోకి చేరి ప్రమాదకారిగా మారుతుందని తెలిపారు.

వైద్యశాస్త్రం ఇంతగా డెవలప్ అయినా కూడా..ఇప్పటికీ కూడా పోలియోలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం..పోలియోని కూడా మహమ్మారిగానే వ్యహరించుకుంటున్నారు. దానికి క్రమబద్ధంగా వ్యాక్సిన్ లో వేస్తూ..నిరోధించుకుంటున్నాం. కానీ పోలియో వచ్చిందంటే దాన్ని మాత్రం తగ్గించుకోలేకపోతున్నాం.

ఇలా చెప్పుకుంటూ పోతే..ఇప్పటి వరకూ వచ్చిన వైరస్ లు చాలావాటికి వ్యాక్సిన్ వచ్చినా అవి వాటి ఉనికిని మాత్రం చాటుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రమాదకారిగా మారిన వైరస్ లు వ్యాక్సిన్ వచ్చినా వాటి మనుగడ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అటువంటివి సోకకుండా..తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనిషి ముందుకు సాగిపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  కాగా..కరోనాకు మందు వచ్చేస్తే..దాని పీడ విరగడ అవుతుందని ఎంతో ఆశగా ఉండే మానవాళికి ఆశాభంగం ఎదురైందనే చెప్పాలి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ మన జీవితాలను ముందుకు సాగించుకోవాలి.

Read: తొమ్మిదవ స్థానంలోకి భారత్.. మరణాల్లో చైనాను దాటేసింది