కరోనా వైరస్‌లో కొత్త లక్షణం.. అయినా భయపడక్కర్లేదు!

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 02:09 AM IST
కరోనా వైరస్‌లో కొత్త లక్షణం.. అయినా భయపడక్కర్లేదు!

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కరోనా వ్యాప్తి రూపాంతరం చెందుతోంది. కరోనా లక్షణాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన Contagion ఇంగ్లీష్ మూవీలో మాదిరిగా కరోనా వైరస్ కొత్తగా మార్పు చెందుతోంది. ముఖ్యంగా ప్రత్యేకించి ఆఫ్రికాలో ప్రాణాంతక వైరస్ మార్పు చెందినట్టు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా రూపాంతరం కారణంగా ప్రపంచ మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. థియేట్రికల్ కంటే వాస్తవం చాలా తక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా కొంతమంది రీసెర్చ్ గ్రూపు పరిశోధకులు కరోనా వైరస్ కొత్త జాతులను గుర్తించినట్టు తెలిపారు. 

కరోనా వైరస్ కొత్త మార్పు చూసి భయపడాల్సిన పనిలేదంటున్నారు. మరో కొత్త జాతిగా కరోనా వైరస్ రూపాంతరం చెందినట్టు తెలిపారు. వైరస్ లో వచ్చిన మార్పులు పెద్దగా ప్రమాదకరమైనవి ఏమి కావని అంటున్నారు. కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా కనిపిస్తున్నాయి. ఒక్కో అధ్యయనం ఒక్కోలా చెబుతుండటంతో సాధారణ ప్రజల్లో గందరగోళానికి దారితీసింది. లేనిపోని భయాలు వ్యక్తమవుతున్నాయి.

జన్యు బ్లూప్రింట్ లేదా జన్యువులో మార్పులు అన్ని సమయాల్లో జరుగుతాయని వైరస్ నిపుణులు చెబుతున్నారు. మిగతా వైరస్ ల మాదిరిగా కరోనా వైరస్ దీనికి మినహాయింపు ఏమి కాదని రీసెర్చ్ గ్రూపు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మేరీల్యాండ్‌లోని Bowie State Universityకి చెందిన వైరాలజిస్ట్ Kari Debbink చెప్పారు. వైరస్లు కేవలం ప్రోటీన్ షెల్స్, DNA లేదా RNAను వాటి జన్యు పదార్ధంగా కలిగి ఉంటాయి.

SARS-CoV-2 విషయంలో RNA ఒకటే ఉంటుంది. న్యూక్లియోటైడ్లు అని పిలిచే RNA బిల్డింగ్ బ్లాక్స్ కోడన్స్ అని పిలిచే triplets అమర్చి ఉంటాయి. ఈ nucleotide త్రయం అమైనో ఆమ్లాలను నిర్మించడానికి కోడ్‌ను అందిస్తుంది. ఇవి వైరస్ ప్రోటీన్‌లను తయారు చేస్తాయి. మ్యుటేషన్ అనేది వైరస్ జన్యు పదార్ధంలో ఈ న్యూక్లియోటైడ్లలో ఒకదానికి మార్పు SARS-CoV-2 విషయంలో, సుమారు 30,000 న్యూక్లియోటైడ్లలో ఒకటిగా చెప్పవచ్చు. 

Read: వైరస్ వ్యాప్తి 6 అడుగులు మాత్రమే కాదు.. 20 అడుగుల వరకూ ప్రమాదమే