కరోనా సోకి ప్రముఖ ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 05:51 AM IST
కరోనా సోకి ప్రముఖ ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ మృతి

కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే యూఎస్ లో కరోనా వైరస్ సోకిన వారిలో చాలామంది భారతీయ-అమెరికన్లు కూడా ఉన్నారు. అయితే ఇండియన్-అమెరికన్లు ఎంతమందికి కరోనా సోకింది అనే దానికి సంబంధించిన ఇప్పటివరకు ఎటువంటి అధికారిక లేదా అనధికారిక లెక్క లేదు.

స్థానిక సోషల్ మీడియా గ్రూప్ ల ప్రకారం న్యూయార్క్,న్యూజెర్సీల్లో చాలామంది భారతీయ-అమెరికన్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఎక్కువగా కరోనా కేసులు నమోదైంది న్యూయార్క్,న్యూజెర్సీ అన్న విషయం తెలిసిందే. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 1లక్షా 42వేల 384మందికి కరోనా సోకగా,న్యూజెర్సీలో 44వేల 416మందికి కరోనా సోకినట్లు తేలింది. ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటివరకు 4వేలకు పైగా కరోనా మరణాలు నమోదైన విషయం తెలిసిందే.  (లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో క్రైమ్, థ్రిల్లర్ షోలు)

కాగా,ఇటీవల న్యూజెర్సీలో కరోనా కాటుకు ఇద్దరు భారతీయులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియన్ న్యూస్ ఏజెన్సీకి చెందిన మాజీ జర్నలిస్ట్ అమెరికాలో కరోనా సోకి మరణించారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ(UNI) మాజీ కాంట్రిబ్యూటర్, వెటరన్ ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల(66) కరోనా సోకి న్యూయార్క్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు.

బ్రహ్మ్ కు భార్య అంజనా,కూతరు సుజనా ఉన్నారు. 1992లో అమెరికా వెళ్లిన బ్రహ్మ్ 28ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తున్నారు. ఫైనాన్షియల్ పబ్లికేషన్-మెర్జర్ మార్కెట్స్ కంటెంట్ ఎడిటర్ గా కూడా బ్రహ్మ్ పనిచేశారు. న్యూస్ ఇండియా-టైమ్స్ వీక్లీ న్యూస్ పేపర్ లో కూడా ఆయన పనిచేశారు. అమెరికాకు వెళ్లేందుకు భారత్ లో కూడా ఆయన పలు మీడియా సంస్థల్లో పనిచేశారు,

AsAm(ఏషియన్ అమెరికన్స్ అండ్ ఫసిఫిక్ ఐల్యాండర్ కమ్యూనిటీస్ కొరకు ఉన్న ఓ పోర్టల్)తెలిపిన ప్రకారం…మార్చి-23,2020న బ్రహ్మ్ లో కరోనా లక్షణాలు మొదటిసారిగా బయటపడ్డాయి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మార్చి-28న న్యూయార్క్ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్ లోని ఓ హాస్పిటల్ లో చేరాడు. మార్చి-31న బ్రహ్మ్ ను వెంటిలేటర్ పై ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఏప్రిల్-6 రాత్రి ఆయన కన్నుమూశారు. ఇది కమ్యూనిటీకి సో్కుతుండటం నిజంగా షాకింగ్. ఇది మాకు మరియు మాకు తెలిసిన ప్రజలకు జరుగుతోందని నమ్మలేకపోతున్నాం అని భారతీయ-అమెరికన్ రాజేంద్ర దిచ్పల్లి అన్నారు. 

ప్రతిరోజూ తమ దగ్గరి మరియు ప్రియమైన వారి నుంచి,మరియు ఇతరుల నుంచి వారికి కరోనా సోకినట్లు రిపోర్ట్ లు వస్తున్నాయని కమ్యూనిటీ లీడర్లు తెలిపారు. వారిలో కొందరు, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) మాజీ అధ్యక్షుడితో సహా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌(ICU)లో ఉన్నారని తెలిపారు.

న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఏరియా మరియు గ్రేటర్ వాషింగ్టన్ ఏరియా ఆఫ్ మేరీల్యాండ్,వర్జీనియాలో చాలామంది కమ్యూనిటీ లీడర్లకు కరోనా సోకినట్లు సమాచారం. అందులో ఎక్కువమంది తమ ఇళ్లల్లో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. చాలామంది హాస్పిటల్స్ లో చేరారు. సిలికాన్ వ్యాలీలో ఓ ఇండియన్ అమెరికన్ IT ఇంజినీర్ కు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.