చిన్నారులు కరోనా వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశం తక్కువ

  • Published By: venkaiahnaidu ,Published On : June 24, 2020 / 03:07 PM IST
చిన్నారులు కరోనా వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశం తక్కువ

చిన్నారులు కరోనా వైరస్ వ్యాప్తి చేసే అవకాశం తక్కువగా ఉందని ఓ సర్వేలో తేలింది. ఫ్రెంచ్‌కు చెందిన పాశ్చర్‌ ఇన్సిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు  పారిస్‌లోని క్రెపి-ఎన్-వలోయిస్ పట్టణంలో 1,340 మంది విద్యార్థులు,టీచర్లపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో  ఆరు ప్రాథమిక పాఠశాలలకు చెందిన 510 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలలో మూడు సంభావ్య కరోనావైరస్ కేసులు తదుపరి వ్యాప్తికి దారితీయలేదని పరిశోధకులు  కనుగొన్నారు.

క్రెపి-ఎన్-వలోయిస్ లో  స్కూల్స్  ఫిబ్రవరి సెలవుల కోసం మూసివేయబడటానికి ముందు మరియు మూడు వేర్వేరు పాఠశాలల్లో కోవిడ్ -19 యొక్క మూడు అనుమానాస్పద కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఇతర పాఠశాల విద్యార్థులు లేదా బోధనా సిబ్బందిలో సెకండరీ  కేసులకు దారితీయలేదని పరిశోధనలో తేలింది. 

పిల్లల్లో ఎక్కువగా రోగ లక్షణం లేనివారిగా  మరియు పెద్దల కంటే తక్కువ అంటువ్యాధుల బారిన పడేవారిగా  కనిపించినట్లు   పరిశోధకులు అంటున్నారు. పిల్లలకు పెద్దల నుంచే ఎక్కువగా కరోనా సోకుతుందని సర్వే పేర్కొంది. చిన్న సంఖ్యలో కేసులను చూస్తున్నందున పిల్లల నుండి వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని విశ్లేషించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని సర్వే టీమ్ ను లీడ్ చేసిన  ఎపిడెమియాలజిస్ట్ ఆర్నాడ్ ఫోంటానెట్ చెప్పారు.

మరోవైపు,ఈ నెల ప్రారంభంలో ప్రచురించబడిన మరో  ప్రత్యేక ఫ్రెంచ్ స్టడీ  కూడా పిల్లలు కరోనా  వ్యాధిని పెద్దలకు వ్యాప్తి  చేసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. తాజా సర్వేల నేపథ్యంలో డెన్‌మార్క్‌, స్విట్జర్లాండ్ దేశాలలో పాఠశాలలు ప్రారంభానికి యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అయితే వివిధ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, వ్యాధి సంక్రమణ తీవ్రత ఆధారంగా స్కూల్స్‌ ప్రారంభించే విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల ఉదృతి వేగంగా పేరగుతున్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 4.56 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో  దాదాపు  16 వేల పాజిటివ్‌ కేసులు,  450 మరణాలు నమోదయ్యాయి.