Two Doses Must : కరోనా నుంచి రక్షణ కోసం ‘‘రెండు డోసులు మస్ట్’’: బ్రిటన్ సైంటిస్టులు

Two Doses Must : కరోనా నుంచి రక్షణ కోసం ‘‘రెండు డోసులు మస్ట్’’:  బ్రిటన్ సైంటిస్టులు

Two Doses Must

Corona Second Wave “Two Doses Must” : క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకీ మ‌రింత విజృంభిస్తోంది. కానీ భారత్ లో మాత్రం ఇంకా వ్యాక్సిన్ల కొరత కొనసాగుతోంది. ఈ క్రమంలో మొదటి డోసు వేయించుకున్నవారు రెండు డోసు వేయించుకోవాలంటే చాలా కష్టంగా మారింది. కారణం వ్యాక్సిన్ కొరత.

మొదటి డోసు వేయించుకున్న తరువాత గడువు ముగిసిన తరువాత అంటే నాలుగు నుంచి ఆరు వారాలు పూర్తి అయ్యాక రెండో డోసు వేయించుకుందామంటే వ్యాక్సిన్ల కొరత వెన్నాడుతోంది. పోనీ మొదటి డోసు వేయించుకున్నాం..కదా రెండో డోసు తప్పనిసరిగా వేయించుకోవాలా? వేయించుకోకుంటే ఏమవుతుంది? ఒక డోసు సరిపోదా? అనే సందేహాలు వస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా రెండు డోసులు వేయించుకోవాలని సూచించింది. కానీ రెండో డోసు వేయించుకోలేని పరిస్థితుల్లో ఉంది భారత్ లో. కానీ సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న క్రమంలో ‘‘రెండు డోసులు మస్ట్’’ అని తేల్చి చెప్పారు బ్రిటన్ సైంటిస్టులు.

సాధారణ వేరియంట్లను నుంచి రక్షణ పొందటానికి ఒక డోసు సరిపోవచ్చు. కానీ భారత్ లో సెకండ్ వేవ్ భారీ స్థాయిలో ప్రభావం చూపుతున్న క్రమంలో కరోనా స్ట్రెయిన్ అంటే సెకండ్ వేవ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి కచ్చితంగా రెండు డోసులు వేయించుకోవాలని బ్రిటన్ సైంటిస్టులు స్పష్టంచేశారు.