మురికినీటిలో Covid-19 వ్యాప్తి, సోకిన వ్యక్తి మలంలోనూ వైరస్ ఉంటుంది : డచ్ సైంటిస్టులు  

  • Published By: sreehari ,Published On : March 31, 2020 / 02:11 PM IST
మురికినీటిలో Covid-19 వ్యాప్తి, సోకిన వ్యక్తి మలంలోనూ వైరస్ ఉంటుంది : డచ్ సైంటిస్టులు  

నెదర్లాండ్స్‌లో covid-19 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకముందే డచ్ సైంటిస్టులు సిటీలోని మురుగు నీటిలో కరోనా వైరస్ ఉందని గుర్తించినట్టు ఓ నివేదిక తెలిపింది. న్యూమోనియా వ్యాధిని వ్యాప్తిచేసే నోవల్ కరోనా వైరస్‌ ప్రారంభంలోనే హెచ్చరించినట్టు పేర్కొంది. SARS-CoV-2 అనే పిలిచే కరోనా వైరస్ సోకిన వ్యక్తి మలంలో కూడా తరచూ కరోనా వైరస్ విసర్జించడం జరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయినప్పటికీ మురుగునీరు కరోనా వైరస్ ప్రసారానికి ముఖ్యమైన మార్గంగా మారే అవకాశం లేదు. కానీ, కమ్యూనిటీలో వ్యాధికారక ప్రసరణ మురుగునీటి వ్యవస్థల్లోకి ప్రవహించే మొత్తాన్ని పెంచుతుందని న్యూవెజిన్‌లోని KWR Water Reasearch Institute గెర్టజన్ మెడెమా తెలిపారు.  

ఆగ్నేయ ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు 50 కిలోమీటర్ల (32 మైళ్లు) దూరంలోని నగరంలో మార్చి 5న అమెర్స్ ఫ్రూట్ ప్రాంతంలో మురుగునీటి ప్లాంట్ దగ్గర కరోనా వైరస్ నుంచి ఒక జెనటిక్ మెటేరియల్ గుర్తించినట్టు తెలిపారు. అప్పటివరకూ నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఫిబ్రవరి 27న తొలి కొవిడ్-19 కేసు నెదర్లాండ్స్ లో ధ్రువీకరించారు. కొన్నిరోజుల తర్వాత దక్షిణేతర భాగంలో హెల్త్ వర్కర్లకు వైరస్ వ్యాపించి అనారోగ్యానికి గురైనట్టుగా గుర్తించారు. అంటే.. కరోనా వైరస్ కమ్యూనిటీలో వ్యాపిస్తోందనే సంకేతాన్ని ఇచ్చింది. 

మురికి నీటిలో కొత్త వైరస్ వ్యాధి ప్రసారం అవుతోందని, దీని కారణంగా ఎలా ప్రమాదం లేదనే విషయాన్ని పారిశుద్ధ్య కార్మికులకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. మన కమ్యూనిటీల్లో SARS-CoV-2 వైరస్ వ్యాప్తిపై పర్యవేక్షించేందుకు సీవేజ్ నిఘాను ఎలా నియోగించుకోవాలో గుర్తించాల్సిన అవసరం ఉందని ఇన్సిస్ట్యూట్ ప్రిన్సిపల్ మైక్రోబయాలిజిస్ట్, కో-అథర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత క్లినికల్ సర్వైలెన్స్ కొవిడ్-19 బాధితులకు పరిమితంగా ఉన్నప్పటికీ వారిలో వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

మురికి నీటిలో SARS-CoV-2 వైరస్ ఉన్నట్టు తొలి రిపోర్టులో గుర్తించినట్టు వారు చెప్పారు. వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ ద్వారా పొలియోవైరస్, యాంటీబయాటిక్ రిసిస్టెంట్ బ్యాక్టిరీయాలను గుర్తించేందుకు సమర్థవంతంగా పనిచేసే మెథడ్ అని కూడా చెప్పారు. నగరంలో వైరస్ వ్యాప్తి ప్రారంభంలో అత్యవసర హెచ్చరికకు కూడా Sewage surveillance పనిచేస్తుందని డెచ్ సైంటిస్టులు వెల్లడించారు. మురికి నీటిలో కనిపించే వైరస్.. తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. జనాభాలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పర్యవేక్షించేందుకు సున్నితమైన టూల్ గా పనిచేస్తుందని వారు చెప్పారు. 

Also Read | కరోనా ఎఫెక్ట్ : విటులు లేక వేశ్యల నరక యాతన