వైరస్ వ్యాప్తి 6 అడుగులు మాత్రమే కాదు.. 20 అడుగుల వరకూ ప్రమాదమే

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 03:42 PM IST
వైరస్ వ్యాప్తి 6 అడుగులు మాత్రమే కాదు.. 20 అడుగుల వరకూ ప్రమాదమే

తుమ్మినా, దగ్గినా, శ్వాస తీసుకునేటప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. చలిగా, తేమతో కూడిన వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాంత బర్బర్ రీసెర్చ్ లో వైరస్ 20 అడుగుల వరకూ వ్యాప్తి చెందుతుందని తేలిందట. 

సోషల్ డిస్టన్స్ ఆరు అడుగుల దూరం పాటించడమనేది సరిపోదు. 20అడుగుల దూరం ఉంటేనే వ్యాప్తిని అడ్డుకోగలం అంటున్నారు. అంతకంటే ముందు జరిపిన రీసెర్చ్ లో 40వేల శ్వాస సంబంధిత తుంపర్లు తుమ్ములు, దగ్గు, సాధారణంగా మాట్లాడటం వల్ల సెకను సమయంలోనే కొద్ది మీటర్ల వరకూ వెళ్లాయి. ఈ స్టడీలతో సైంటిస్టులు తుంపర్ల ఏరోడైనమిక్స్ పై రీసెర్చ్ చేశారు. హీట్, మాస్ ఎక్స్‌ఛేంజ్ ల వల్ల వైరస్ వ్యాప్తి మారుతుందని కనుగొన్నారు. 

వాతావరణ పరిస్థితులు మారినట్లుగా వ్యాప్తి ఎప్పుడూ ఒకేదారిలో ప్రయాణిస్తుందని చెప్పలేం. తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) 6అడుగుల దూరాన్ని సూచించింది. వాతావరణ పరిస్థితులు మారుతుంటే ఇది 6మీటర్ల వరకూ ఉండాలని అంటే దాదాపు 19.7అడుగుల దూరం వరకూ తుంపర్లు ప్రయాణిస్తాయని తెలిపారు. 

సైంటిస్టులు వాతావరణ అంశాలైన ఉష్ణోగ్రత, తేమలు వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. 2002-03ay SARS మహమ్మారి, ఇన్‌ప్లూయెంజాలు వీటికి ఉదహరణలుగా చెప్పారు. COVID-19కూడా స్పష్టత లేకపోయినా అది అలాగే వ్యాప్తి చెందుతుందని రీసెంట్ స్టడీ తెలిపింది.