కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31

కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31

కరోనా అప్‌డేట్: లక్ష దాటిన బాధితులు.. ఇండియాలో 31

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ సోకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోని 90 దేశాలలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 3500కు మించిపోయింది. చైనాలో ఇప్పటివరకు 80,552 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 3,042 మంది మరణించారు. చైనా బయట మొత్తం 17,571 కేసులు నమోదవగా.. అందులో వైరస్ కారణంగా 343 మంది మరణించారు.

చైనా తరువాత కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాలు దక్షిణ కొరియా (6,284 కేసులు, 42 మరణాలు), ఇటలీ (3,858 కేసులు, 148 మరణాలు), ఇరాన్ (3,513 కేసులు, 107 మరణాలు) మరియు ఫ్రాన్స్ (423 కేసులు, ఏడు మరణాలు). గురువారం నాటికి, పాలస్తీనా మరియు భూటాన్లలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

అయితే, కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు సగానికి పైగా కోలుకున్నారు. ఇటలీతో పాటు, ఇరాన్, పాకిస్తాన్ మరియు భారతదేశంలలో కూడా కరోనా వైరస్ రోగులు కనిపిస్తున్నారు. భారతదేశంలో కరోనాతో బాధపడుతున్న రోగుల సంఖ్య శుక్రవారం(07 మార్చి 2020) నాటికి 31 కి చేరుకుంది.ఇక 
అమెరికాలో కాలిఫోర్నియాలో తీరంలో నిలిపి ఉంచిన నౌకలో 21 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం మూడు శాతం  పడిపోయింది. కరోనా కారణంగా ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన లెక్కలు:

దేశం        సోకినవారు  చనిపోయినవారు
చైనా   80,651 3,070
దక్షిణ కొరియా 6,593   44
ఇరాన్‌       4,747   124
ఇటలీ 4,636 197
అమెరికా 230   14
జపాన్‌  348 06
ఫ్రాన్స్‌  423   07
హాంకాంగ్‌    104 02
భారత్‌  31 00
ప్రపంచవ్యాప్తంగా..  100,840 3,483

See More :

*  క‌రోనా ఎఫెక్ట్: ర‌జనీకాంత్ సినిమా షూటింగ్‌కి బ్రేక్

గాంధీలో కరోనా బాధితుడికి మంత్రి ఈటల పరామర్శ, మాస్క్ లేకుండానే..

తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

×