అయ్యో అమెరికా వాళ్లు: విమానం ఎక్కుతున్నారు.. ఇంతలో కరోనా ఉందంటూ రిపోర్ట్‌

  • Published By: vamsi ,Published On : February 17, 2020 / 01:21 PM IST
అయ్యో అమెరికా వాళ్లు: విమానం ఎక్కుతున్నారు.. ఇంతలో కరోనా ఉందంటూ రిపోర్ట్‌

జపాన్ తీరం వెంబడి లంగరేసిన క్రూయిజ్ షిప్‌లో కరోనా వైరస్ అందులోని ప్రజలను భయపెడుతుంది. ఇప్పటికే షిప్‌లో కొందరికి ఈ వైరస్ సోకి ఉంది. అయితే అమెరికాకు చెందిన 14 మందికి కరోనా వైరస్ సోకలేదు, మూమలుగానే ఉన్నారని అనుకుని వాళ్లను అమెరికా విమానం ఎక్కేంచుకుని తీసుకుని వెళ్లేందుకు ప్లాన్ చేశారు ఆ దేశం వాళ్లు. అయితే ఇంతలోనే వాళ్లకు కరోనా వైరస్ సంక్రమించిందని తేలింది. అంతే వాళ్లను quarantine చేశారు. 

క్రూయిజ్ షిప్‌లో ఉండిపోయిన వివిధ దేశాల వాళ్లను వారి వారి దేశాలకు తరలించేందుకు చాలాదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా తమ దేశీయులు 14మందిని షిప్ నుంచి బైటకు తీసుకొచ్చింది. వాళ్లను అమెరికాకు తీసుకెళ్లేందుకు విమానంలో ప్రత్యేక ఎర్పాట్లు చేశారు. వాళ్లను విమానం ఎక్కించేందుకు పరీక్షిస్తే వాళ్లకు వైరస్ ఉందని తేలింది. దీంతో చేసేదేం లేక వాళ్లను జపాన్ వేరేచోటకు తరలించింది.

యొకొహామా దగ్గర నిర్బంధించిన క్రూయిజ్ షిప్‌లో 300 మంది అమెరికన్స్ ఉన్నారు. వీళ్లను తిరిగి స్వదేశానికి తీసుకొని వచ్చేందుకు ఆ దేశం ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైరస్ సోకినవాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ దేశంలోకి అనుమతించకూడదు అనేది అమెరికా ఇప్పటికే తీసుకున్న నిర్ణయం. ఈ క్రమంలోనే క్రూయిజ్ షిప్‌లో వాళ్లకు వైరస్ లేదని నిర్ధారించుకుని వాళ్లను తీసుకుని వెళ్లాలని అనుకుంది. మొదటివిడతగా 14మందిని తీసుకెళ్లాలని చాపర్ విమానాన్ని సిద్ధం చేసింది అమెరికా. 

అయితే తరలింపు ప్రక్రియలో షిప్ నుంచి ప్రయాణీకులు కిందకు దిగి ఎయిర్ పోర్ట్ కెళ్లారు. ధైర్యంగా విమానం ఎక్కించబోయారు. ఈలోగా వీళ్లకు మూడురోజుల క్రితం చేసిన పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. అందులో పాజిటివ్. అమెరికా అధికారులు అదిరిపడ్డారు. అమెరికాలో ఇప్పటికే 15మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. ఈ 14మంది ప్రయాణీకులను కలుపుకుంటే 29కి చేరుకుంది అమెరికా కరోనా బాధితుల సంఖ్య.