ఆ మహిళపైనే కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ ప్రారంభం…అందుబాటులోకి ఎప్పుడు?

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2020 / 12:47 PM IST
ఆ మహిళపైనే కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ ప్రారంభం…అందుబాటులోకి ఎప్పుడు?

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతోంది.  కరోనా వైరస్ నుండి రక్షించడానికి వ్యాక్సిన్ కోసం కోసం క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తి సోమవారం ఒక ఎక్స్ పరిమెంటల్ డోస్(ప్రయోగాత్మక మోతాదు)ను అందుకున్నట్లు ఓ అమెరికా ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ ట్రయిల్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోంది. ఇది సీటెల్‌ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోఈ ట్రయిల్ జరుగుతోంది.

ఏదైనా పొటెన్షియల్ వ్యాక్సిన్‌ను పూర్తిగా ధృవీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతున్నారు. NIH మరియు మోడెర్నా ఇంక్ సహ-అభివృద్ధి చేసిన ఢిఫరెంట్ షాట్స్ యెక్క డోసెస్ తో 45 మంది యువ,ఆరోగ్యకరమైన వాలంటీర్లతో టెస్టింగ్ ప్రారంభమయింది. పాల్గొనేవారు షాట్ల నుండి వ్యాధి బారిన పడే అవకాశం లేదు, ఎందుకంటే వారు వైరస్ కలిగి ఉండరు. వ్యాక్సిన్లు ఎటువంటి ఆందోళన కలిగించే సైడ్ ఎఫెక్ట్ లు చూపించలేవని చెక్ చేయడమే దీని లక్ష్యం. ఇది పెద్ద పరీక్షలకు వేదికగా నిలిచింది.

జెన్నీఫర్ హెల్లర్ అనే మహిళకు(ఆమెకు కరోనా వైరస్ లేదు) ప్రపంచంలోనే మొదటగా ఈ పొటెన్షియల్ వ్యాక్సిన్ ఇవ్వబడింది. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం చాలా నిస్సహాయంగా ఉన్నారు. నేను సహాయం చేయడానికి ఏదైనా చేయగలనని నేను గ్రహించాను. నేను ఇక్కడ ఉండటానికి సంతోషిస్తున్నాను అని జెన్నీఫర్ అన్నారు. వ్యాక్సిన్ సేఫ్టీని పరీక్షించడానికి 28 రోజుల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లు ఇచ్చిన 45 మంది వాలంటీర్లలో హెల్లర్ ఒకరు. సామూహిక ఉత్పత్తి మరియు పంపిణీకి ఏదైనా వ్యాక్సిన్ గ్రీన్ లైట్ ఇవ్వడానికి ముందు అవసరమైన పెద్ద సంఖ్యలో ప్రక్రియలలో ఇది ఒకటి.

కరోనా వైరస్(COVID-19) కేసులు పెరుగుతూనే ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ రీసెర్చ్ గ్రూప్ లు వ్యాక్సిన్‌ను క్రియేట్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా, వారు వివిధ రకాలైన వ్యాక్సిన్లను అనుసరిస్తున్నారు(సాంప్రదాయిక వ్యాక్సిన్ ల కంటే వేగంగా ఉత్పత్తి చేయడమే కాకుండా మరింత శక్తివంతమైనదని రుజువు చేసే కొత్త టెక్నాలజీస్ నుండి అభివృద్ధి చేయబడిన షాట్లు).కొంతమంది పరిశోధకులు తాత్కాలిక టీకాలే  లక్ష్యంగా పెట్టుకున్నారు.

కరోనాకు వ్యాక్సిన్ పై తాము పనిచేస్తున్నామని)క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం జనవరిలో (వైరస్ వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్న సమయం) ప్రకటించింది. కోయలిషన్ ఆఫ్ ఎపిడెమిక్ ప్రిపరేడ్ నెస్ ఇన్నోవేషన్స్ (CEPI) అని పిలువబడే అంతర్జాతీయ వ్యాక్సిన్ల అభివృద్ధి సమూహంలో భాగమైన ఈ బృందం ఇప్పుడు 24గంటలూ వైరస్ కు వ్యాక్సిన్ కోసం పనిచేస్తోంది. తమ టీమ్ అభ్యర్థిని ఎంచుకుందని, వ్యాక్సిన్‌, ప్రీ-క్లినికల్ టెస్టింగ్ ప్రారంభమైందని ఒక ప్రతినిధి తెలిపారు. ఇది జూన్ చివరి నాటికి మానవ పరీక్షల వైపు సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని ప్రతినిధి చెప్పారు.

అఫ్రూవల్స్ వేగంగా గుర్తించబడతాయి
ప్రపంచవ్యాప్తంగా, సుమారు 35 కంపెనీలు మరియు విద్యాసంస్థలు వ్యాక్సిన్ రేసులో ఉన్నాయి. కనీసం నాలుగు కంపెనీలు జంతువులపై ఇప్పటికే పరీక్షలు చేస్తున్నారు, మరో రెండు… మానవ పరీక్షలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ డైలీ వార్తాపత్రిక నుండి వచ్చిన నివేదికల ప్రకారం… దేశంలోని అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు ఈ వారం పొటెన్షియల్ వ్యాక్సిన్ కోసం ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అనుమతి పొందారు. చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న క్లినికల్ ట్రయల్ డేటాబేస్… “ఫేజ్ వన్” పరీక్ష మానవులలో ప్రయోగాత్మక షాట్ సురక్షితంగా ఉందో లేదో నిర్ణయిస్తుందని పేర్కొంది. మార్చి 16 నుంచి డిసెంబర్ 31 మధ్య నడుస్తున్న ఈ ట్రయిల్ లో పాల్గొనడానికి 108 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ వారం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వ్యాక్సిన్ నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చని మరియు ఆరు నెలల్లో ఒక కరోనా వైరస్ షాట్ మార్కెట్లో ఉండవచ్చని ఆయన సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులతో ఇది విభేదిస్తుంది. ఇది పూర్తిగా పరీక్షించిన మరియు ఆమోదించబడిన వ్యాక్సిన్ 2021 మధ్యలో మార్కెట్‌కు చేరుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ఆశించట్లేదు డబ్యూహెచ్ఓ. కరోనావైరస్ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న జర్మన్ బయోటెక్ కంపెనీ క్యూర్‌ వాక్‌తో చర్చలు జరిపిన తరువాత తక్కువ కాలపరిమితి సాధ్యమని వాన్ డెర్ లేయన్ చెబుతున్నారు. బోస్టన్ ప్రధానకేంద్రంగా పనిచేసే బయోటెక్ సంస్థ మోడెర్నా..వచ్చే నెలలో మనుషులపై వ్యాక్సిన్ ట్రయిల్ ఉంటుందని బహిరంగంగా ప్రకటించింది.

ఇది సుదీర్ఘ ప్రక్రియ

వ్యాక్సిన్ తొందరగా వచ్చేస్తుందన్న ఆశావాదం ఉన్నప్పటికీ, వేగంగా ట్రాక్ చేయబడిన సమయపాలనతో కూడా, ఇంకా చాలా దూరం వెళ్ళాలని చాలా మంది శాస్త్రవేత్తలు మరియు నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ లు, అన్ని మెడిసిన్స్ మాదిరిగానే అవి సురక్షితంగా ఉన్నాయా మరియు సాధారణ ప్రజలకు పంపిణీ చేయవచ్చో అని అధికారులు నిర్ణయించే ముందు వరుస క్లినికల్ ట్రయల్స్ చేయవలసి ఉంటుంది.

మెల్ బోర్న్ యొక్క డోహెర్టీ ఇన్ స్టిట్యూట్ లో ఎపిడెమియాలజీ డైరెక్టర్ జోడీ మెక్ వెర్నన్ బుధవారం కాన్ బెర్రాలోని నేషనల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ… ఈ ప్రయత్నాన్ని CEPI సమన్వయం చేస్తోందని అన్నారు. కానీ ప్రజలను రక్షించడానికి ప్రక్రియలు ఉన్నాయని ఆమె హెచ్చరించారు, మరియు సహనం ముఖ్యమని ఆమె తెలిపారు. మనం ఆవిష్కరణ నుండి, అభివృద్ధికి, క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లాలి అని డాక్టర్ మెక్‌ వెర్నన్ అన్నారు. వ్యాక్సిన్ లు తగిన విధంగా ప్రయత్నించే వరకు పనిచేస్తాయో లేదో మాకు ఆధారాలు లేవు.ఈ దశలన్నీ జరగాలి. అందుకే ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని మేము చెప్తున్నాము అని మెక్‌ వెర్నన్ అన్నారు.