ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ళ నుంచే కరోనా….చైనా నుంచి వైరస్ రాలేదంట

  • Published By: venkaiahnaidu ,Published On : July 9, 2020 / 05:52 PM IST
ప్రపంచవ్యాప్తంగా  చాలా ఏళ్ళ నుంచే కరోనా….చైనా నుంచి వైరస్ రాలేదంట

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉండవచ్చని ఓ టాప్ ఎక్స్ పర్ట్ తెలిపారు.

ఫైనల్ ఎమర్జ్ కోసం కోవిడ్ -19 అనుకూలమైన పర్యావరణ పరిస్థితులకై వేచి ఉన్నట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్(CEBM)కు చెందిన డాక్టర్ టామ్ జెఫెర్సన్ తెలిపారు. ఆహార కర్మాగారాలు మరియు మీట్‌ప్యాకింగ్ ప్లాంట్లు వంటి వాతావరణంలో వైరస్ ఎలా మరియు ఎందుకు వృద్ధి చెందుతోందో పరిశోధించాలని డాక్టర్ జెఫెర్సన్ పిలుపునిచ్చారు.

న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలోని విజిటింగ్ ప్రొఫెసర్ మాత్రం వైరస్ ఆసియాలో ఉద్భవించక ముందే మరెక్కడో ఉన్నట్లు ఆధారాలు పెరుగుతున్నాయని వాదిస్తున్నారు. ఈ వైరస్ మొదట ఆసియాలోనే మొదట పుట్టలేదని అయన అంటున్నారు.

చైనాలో వైరస్ కనుగొనడానికి ముందే కోవిడ్ -19 యొక్క జాడలు స్పెయిన్, ఇటలీ మరియు బ్రెజిల్ మురుగునీటి సాంపిల్స్ కనుగొనబడ్డాయి.

మురుగునీటి వ్యవస్థ ద్వారా లేదా షేర్డ్ లావటరీ సదుపాయాల ద్వారా కొత్త ప్రసార మార్గాలను ఇది వెలికితీస్తుందని CEBM డైరెక్టర్ ప్రొఫెసర్ కార్ల్ హెనెగాన్‌తో పాటు డాక్టర్ జెఫెర్సన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వింతైన విషయాలు స్పానిష్ ఫ్లూతో జరిగాయి. 1918 లో, పాశ్చాత్య సమోవా జనాభాలో 30 శాతం మంది స్పానిష్ ఫ్లూతో మరణించారు మరియు వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అని అయన తెలిపారు.

అన్ని చోట్ల మురుగునీటిలో భారీ మొత్తంలో వైరస్ ఉన్నట్లు ఇక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయని మరియు మల ప్రసారం కుడా ఉన్న సాక్ష్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యాప్తిపై సరిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.