కరోనావైరస్: సెకండ్ వేవ్ అంటే ఏంటి.. నిజంగా రాబోతుందా?

  • Published By: Subhan ,Published On : June 21, 2020 / 09:34 AM IST
కరోనావైరస్: సెకండ్ వేవ్ అంటే ఏంటి.. నిజంగా రాబోతుందా?

కరోనా వైరస్ కొన్ని దేశాలను విడిచిపెట్టేసినా మిగిలిన దేశాల్లో ప్రభావం అలాగే ఉంది. తగ్గిపోయిన దేశాల్లో సెకండ్ ఫేజ్ కూడా మొదలవనుందని నిపుణులు చెబుతున్నారు. శతాబ్దం క్రితం ప్రబళిన స్పానిష్ ఫ్లూ కూడా రెండో సారి అటాక్ చేసి మరింత ప్రమాదకరంగా మారింది. ఇదే కోవలో కరోనా వైరస్ కూడా సెకండ్ వేవ్ గా రానుందా.. రెట్టింపు ప్రమాదకరంగా మారుతుందా..

అసలు సెకండ్ వేవ్ అంటే ఏంటి:
వేవ్ అని సముద్రంలో అలలను కదా అనేది. ఇది వైరస్ కు ఎలా సరిపోతుందంటే. ఇన్ఫెక్షన్లు పెరిగి తగ్గుతుంటాయి కాబట్టి దీన్ని తరంగం అంటారు. సముద్రంలో అలల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇది కూడా వేవ్. సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లు న్యూజిలాండ్ లో మొదలైనట్లు కనిపిస్తుంది. 24రోజులుగా ఒక్క వైరస్ కూడా నమోదుకాకుండా గడిపేసిన కివీస్ ప్రజలను మరోసారి వైరస్ అటాక్ చేయనుంది.

బీజింగ్ లోనూ అదే పరిస్థితి. 50రోజులు వైరస్ కేసులు నమోదు కాకుండా గడిపి మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇదే కోవలో ఇరాన్ కూడా సెకండ్ వేవ్ కు రెడీ అయిపోతుందంటున్నారు సైంటిస్టులు. లండన్ కు కూడా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచిఉందనేది వాస్తవం. 

సెకండ్ వేవ్ రావడానికి కారణాలేంటి:
లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేయడం.. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా జన సందోహం సమాజంలోకి వచ్చిపడ్డారు. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు.  ‘నియంత్రణ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. రోజువారీ పనులు ఆపుకోవడం కష్టమే. కానీ దాంతో పాటు జాగ్రత్తలను విస్మరిస్తున్నారు’ అని విశ్లేషకులు అంటున్నారు. 

వైరస్ మన పరిసరాల్లో ఉంటే 100శాతం సేఫ్ గా ఉంటామని నమ్మకాన్ని ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. వీలైనంత వరకూ ఫేస్ కవరింగ్ (మాస్క్ లు) వాడి వ్యాప్తిని అడ్డుకోవడమే. యూకేలో ఇతర దేశాల్లో లాక్ డౌన్ ఎత్తేయడంతో వ్యాప్తి అనేది మళ్లీ మొదలైంది. జర్మనీలోనూ 650 మందికి పాజిటివ్ వచ్చి సెకండ్ వేవ్ మొదలైనట్లు స్పష్టం చేసింది. విజయవంతంగా వైరస్ ను అడ్డుకుందని కాంప్లిమెంట్ లను పొందిన దక్షిణ కొరియా మరోసారి నిబంధనలు పెట్టి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. 

ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరమా:
అలా జరిగితే అంతకంటే నష్టం మరొకటి ఉండదు. ఏ దేశం మళ్లీ అంతా నార్మల్ గా జరుగుతుందని చెప్పడం లేదు. కరోనావైరస్ ను అదుపుచేయలేకపోతున్నా బ్రెజిల్, ఇండియాలు 3.0 అమలు చేసే ఆలోచనల్లో లేవు. కేసులు పెరుగుతున్న కొద్దీ.. అది కాస్త నిదానంగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైతే అంతకుముందులా లాక్‌డౌన్ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి మరింత ప్రమాదకరం కావొచ్చు. 

వైరస్‌పై చలికాలం ప్రభావం:
సాధారణంగానే చలికాలంలో మామూలు వైరస్ అటాక్ అయి జలుబు, దగ్గు, జ్వరం వంటివి రావడం చూస్తుంటాం. ఇక కరోనావైరస్ విషయంలో అది ఇంకా డేంజర్. ఆగష్టు, సెప్టెంబరు నెలాఖరులో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. 

Read: సూర్యగ్రహణంతో కరోనా వైరస్ అంతం, వాస్తవం ఎంత