ఆరోగ్యంగా ఉన్నా మాస్క్ మస్ట్, కరోనాపై WHO కీలక సూచన

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 10:24 AM IST
ఆరోగ్యంగా ఉన్నా మాస్క్ మస్ట్, కరోనాపై WHO కీలక సూచన

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తి కట్టడికి కొత్త సూచన చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో(జనం మధ్యలో) ఉన్నప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పింది. తుంపర్ల నుంచి మాస్క్ రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలంది. అనారోగ్యంగా ఉన్న వాళ్లు మెడికల్ ఫేస్ మాస్కులు ధరించాలంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఈ సూచన తప్పనిసరిగా పాటించాలంది.

వైరస్ తుంపర్ల నుంచి రక్షణ:
దీనిపై డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ శనివారం(జూన్ 6,2020) వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చాయని ఆయన గుర్తు చేశారు. వైర‌స్ మోసుకెళ్తున్న తుంప‌ర్ల నుంచి మాస్క్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న తాజా సూచ‌న‌ల్లో అభిప్రాయ‌ప‌డింది. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన వారు మెడికల్ ఫేస్ మాస్కును తప్పనిసరిగా వాడాలని చెప్పారు. సాధారణ ప్రజలు ఫ్యాబ్రిక్ మాస్క్ ను వాడాలని సూచించారు. పబ్లిక్ ప్లేసులు, మాల్స్, దుకాణాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు.

గతంలో అలా, ఇప్పుడు ఇలా:
కేవలం మాస్కులు మాత్రమే కరోనా నుంచి ప్రజల్ని కాపాడతాయి, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలన్న ఆధారాలు తమ దగ్గర ఏమీ లేవని, అందుకే తాము అలా చెప్పలేమని గతంలో డబ్ల్యూహెచ్ వో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను డబ్ల్యూహెచ్ వో సవరించుకుంది. ఇటీవల చేసిన అధ్యయనాల ద్వారా కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైర‌స్ వ్యాప్తి జ‌రిగే రిస్క్ ఉన్న ప్రాంతాల్లో క‌చ్చితంగా మాస్క్‌ను పెట్టుకోవాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో టెక్నిక‌ల్ నిపుణులు డాక్ట‌ర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా 68లక్షల 44వేల కరోనా కేసులు, 3లక్షల 98 వేల మరణాలు:
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68లక్షల 44వేల 797 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30లక్షల 97వేల 791. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల 98 వేల 146 మంది మరణించారు. వ్యాధి నుంచి 33లక్షల 48వేల 860 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా గురవుతోంది. అమెరికాలో ఇప్పటివరకు లక్షా 11వేల 390 మంది చనిపోయారు. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు:
బ్రెజిల్‌-35,047, రష్యా-5,528, స్పెయిన్‌-27,134, యూకే-40,261, ఇటలీ-33,774, పెరూ-5,162, జర్మనీ-8,763, టర్కీ-4,648, ఇరాన్‌-8,134, ఫ్రాన్స్‌-29,111, చిలీ-1,448, మెక్సికో-13,170, కెనడా-7,703, పాకిస్థాన్‌-1,838, చైనా-4,634, బెల్జియం-9,566, నెదర్లాండ్స్‌-6,005, స్వీడన్‌-4,639, ఈక్వెడార్‌-3,534, కొలంబియా-1,145, పోర్చుగల్‌-1,465, ఈజిప్టు-1,166, స్విట్జర్లాండ్‌-1,921, ఇండోనేషియా-1,770, పోలాండ్‌-1,137, ఐర్లాండ్‌-1,670, రొమేనియా-1,316.

Read: ఎక్కువ టెస్టులు చేయగలిగితే ఇండియాలో కేసులు పెరిగిపోతాయి: ట్రంప్