కరోనా విశ్వరూపం, 64 దేశాలను వణికిస్తున్న కరోనా.. 2,978కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా... బాధితుల సంఖ్య 87వేలకు చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 05:38 AM IST
కరోనా విశ్వరూపం, 64 దేశాలను వణికిస్తున్న కరోనా.. 2,978కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా… బాధితుల సంఖ్య 87వేలకు చేరింది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… ప్రస్తుతం 64 దేశాలకు విస్తరించి అందరినీ వణికిస్తోంది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా… బాధితుల సంఖ్య 87వేలకు చేరింది. చైనాతోపాటు ఇతర దేశాల్లోను బాధితులు, మృతుల సంఖ్య పెరుగోతంది. ఆస్ట్రేలియాలో కరోనా కారణంగా తొలి మరణం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ సహా పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీని జారీచేయగా.. మక్కా సందర్శనకు వచ్చే విదేశీ యాత్రికులను సౌదీ తాత్కాలికంగా నిషేధించింది.

చైనాలో మళ్లీ కరోనా పంజా 
చైనాలో మొన్న కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది. నిన్న కూడా అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. మొన్నటివరకు రోజుకు 300 కేసులు నమోదవగా… ఆ సంఖ్య మళ్లీ 500 దాటేసి దడ పుట్టిస్తోంది. నిన్న  ఏకంగా 575 కొత్త కరోనా కేసులు నమోదవడం చైనాను కలవరపెడుతోంది. అయితే మృతుల సంఖ్య మాత్రం తగ్గడం కాస్త ఊరటనిచ్చింది. చైనాలోని కరోనా బాధితుల్లో నిన్న 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2వేల870కి చేరింది. చైనాలో ఇప్పటివరకు 79వేల826  కరోనా కేసులు నమోదవగా… అందులో 41వేల825మంది కోలుకున్నారు. 7వేల 365 మంది పరిస్థితి విషమంగా ఉంది.

దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తీవ్రత 
చైనాతోపాటు… దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. సౌత్ కొరియాలో మొత్తం 3వేల 526 కేసులు నమోదవగా.. ఇప్పటికే 17 మంది చనిపోయారు. మరో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనా తర్వాత సౌత్‌ కొరియాలోనే అధికంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే దక్షిణ కొరియాలో కొత్తగా 376మందికి ఆ వైరస్ సోకింది. 

ఇరాన్‌లో కరోనా విలయతాండవం 
ఇరాన్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 43 మంది చనిపోయారు. ఆ దేశంలో ప్రస్తుతం 593 మంది కరోనా సోకి బాధపడుతున్నారు. వారిలో ఇరాన్ ఉపాధ్యక్షురాలు కూడా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు జరిపిస్తోంది. అన్ని స్కూళ్లనూ 3 రోజులపాటు మూసేయాలని డిసైడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ లేదా రేపు ఇరాన్‌ రానుంది.

ఇటలీలో మహమ్మారి యమపాశం 
ఇటలీలోను ఈ మహమ్మారి యమపాశం విసురుతోంది. ఆ దేశంలో ఇప్పటికే 29మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక్కడ ఒకవెయ్యి 128 కరోనా కేసులు నమోదవగా… వంద మందికి పైగా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. దీంతో ఇక్కడ కరోనా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

జపాన్‌లో కరోనాకు ఆరుగురు బలి  
జపాన్‌లోని యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని ఆరుగురిని కూడా కరోనా బలి తీసుకుంది. నౌకలో మొత్తం 705 మందికి కరోనా సోకగా…  10మంది కోలుకున్నారు. మరో  36 మంది ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తేల్చారు.