పిట్టల్లా రాలిపోతున్నారు : కరోనా రాకాసికి 21 వేల 200 మంది బలి

  • Published By: madhu ,Published On : March 26, 2020 / 02:30 AM IST
పిట్టల్లా రాలిపోతున్నారు : కరోనా రాకాసికి 21 వేల 200 మంది బలి

ప్రపంచాన్ని కరోనా రాకాసి వణికిస్తోంది. చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే దేశాలకు పాకింది. ఈ వైరస్ కు విరుగుడు, మందు లేకపోవడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. చైనా ఈ వైరస్ ని నియంత్రించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది.

ఇటలీలో మాత్రం మరణమృందంగం మ్రోగిస్తోంది. వేలాది సంఖ్యలో చనిపోతున్నారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం ఉదయం వరకు ప్రపంచ వ్యాప్తంగా 21, 200 మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. మొత్తం 4 లక్షల 68 వేల 905 మందికి ఈ వైరస్ సోకింది. అందులో 14 వేల 792 మందికి సీరియస్ గా ఉంది. 3 లక్షల 33 వేల 487 మంది ఈ వైరస్ తో పోరాడుతుంటే…లక్షా 14 వేల 218 మంది కోలుకున్నారు. 198 దేశాకు కరోనా వైరస్ విస్తరించింది. 
 

ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే..
ఇటలీ : 7,503. స్పెయిన్ : 3,647. చైనా : 3,287, ఇరాన్ : 2, 077. ఫ్రాన్స్ : 1,331, యూఎస్ఐ : 994. యూకే : 465. నెదర్లాండ్స్ : 356. జర్మనీ : 206, బెల్జియం : 178. స్విట్జర్లాండ్ : 153. సౌత్ కొరియా : 126. 

Also Read | ఈ ఖాకీ గుండె ఎంత మంచిదో: గర్భిణి కోసం కారు ఇచ్చేసి!