ఆరోగ్యశాఖామంత్రికి కరోనా నిర్ధారణ..ప్రధానికి కూడా సోకినట్లుగా అనుమానం

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 05:39 AM IST
ఆరోగ్యశాఖామంత్రికి కరోనా నిర్ధారణ..ప్రధానికి కూడా సోకినట్లుగా అనుమానం

ఆకలికి రాజు పేద తేడా తెలీదు. అలాగే రోగాలకు కూడా పేద గొప్పా తేడా తెలీదు. కరోనా వైరస్ కు కూడా సమానత్వాన్ని పాటిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ఎన్నో దేశాలకు వ్యాపించింది. ఇరాన్ లో ఏకంగా 29మంది ఎంపీలకు..పలువురు మంత్రులకు సోకింది.  తాజాగా ఇప్పుడు ఆరోగ్యశాఖా మంత్రిని కూడా కరోనా వదల్లేదు. బ్రిటన్ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి నాడీన్ డోరిస్ కు కరోనా వైరస్ సోకింది. 

కరోనా లక్షణాలు కనిపించటంతో నేను టెస్ట్ లు చేయించుకోవటంతో పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఆమెనే ప్రకటించారు. దేశంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మంత్రి ఫైల్ మీద సంతకం చేస్తున్న సమయంలోనే ఆమె అస్వస్థతకు గురవటం గమనించాల్సిన విషయం. ఆఫీసులో ఫైల్ మీద సంతకం చేసిన తరువాత మంత్రి డోరీన్ పలువురు అధికారులను..నాయకులను కలిసి మాట్లాడారు. 

దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత మంత్రి కలిసి మాట్లాడిన అధికారులను..నాయకులను గుర్తిస్తున్నారు.వారికూడా కరోనా సోకి ఉంటుందని అనుమానంతో వారిని గుర్తించి పరీక్షలు చేయించే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు మంత్రి డోరిన్ ఆరోజున ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధానికి కూడా అధికారులు టెస్ట్ లు చేయించటానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.   

దీనిపై మంత్రి డోరీస్ మాట్లాడుతూ..కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాననీ కానీ కరోనా సోకిందనీ దీంతో నేను స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటికే పరిమితమైపోయానని తెలిపారు.

కాగా..చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతూ..పలువురిని బలితీసుకుంటోంది. ఈక్రమంలో యూరప్ దేశాల్లోని ఇటలీలో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అలాగే బ్రిటన్ లో కూడా కరోనా హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే 378మందికి కరోనా సోకగా వారిలో ఆరుగురు మరణించారు. 

See Also | మచిలీపట్నం సెంట్రల్‌బ్యాంక్‌లోరూ.6.71 కోట్ల కుంభకోణం..గోల్డ్‌లోన్స్‌లో చీటింగ్