Oxygen shortage: ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాలు

Oxygen shortage: ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాలు

Oxygen Shortage

Severe oxygen shortages: కరోనా వైరస్ సెకండ్ వేవ్.. అనేక దేశాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సమయంలో ఆక్సిజన్ కొరతతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. డజన్ల కొద్దీ దేశాలు ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరోగ్య వ్యవస్థల పతనం జరుగుతున్నట్లుగా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేటెస్ట్‌గా నివేదించింది.

తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న దేశాలలో అర్జెంటీనా, ఇరాన్, నేపాల్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేషియా, పాకిస్తాన్, కోస్టా రికా, కొలంబియా, ఈక్వెడార్ మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ దేశాలలో చాలావరకు మహమ్మారి బాధితులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. COVID-19 వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోగా.. వినాశకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ దేశాల్లో గత కొన్ని నెలలుగా ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ దేశాలలో చాలా మంది 10 మందిలో ఒకరి కంటే తక్కువ మందికి వ్యాక్సిన్ అందింది అని బ్యూరో పేర్కొంది. భారతదేశంలో కొనసాగుతున్న సంక్షోభం ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకుని తగ్గుముఖం పట్టగా.. ఆక్సిజన్ కొరత భారతదేశ మరణాల సంఖ్యకు కారణం అయ్యింది. ఈ కారణంగానే ద్రవ మరియు సిలిండర్ ఆక్సిజన్ ఎగుమతిని భారత్ నిషేధించింది.

నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మయన్మార్ తదితర దేశాలు భారత ఆక్సిజన్ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. భారత్‌లో ఆక్సిజన్ డిమాండ్ కారణంగా ఆ దేశాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దేశాల్లో కోవిడ్-19 దెబ్బకు ఆక్సిజన్ ఎమర్జెన్సీ ఏర్పడినట్లుగా టాస్క్‌ఫోర్స్ చైర్ రాబర్ట్ మాటిరు బ్యూరోకు చెప్పారు.

ఆక్సిజన్ కోసం పెరుగుతున్న అవసరం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. ఆక్సిజన్ అవసరం తీర్చలేని పరిస్థితిలో రోగి మరణానికి కారణం అవుతున్నట్లుగా బ్యూరో చెబుతుంది. బ్రెజిల్‌, నైజీరియా వంటి దేశాల్లో కొవిడ్‌ ఆసుపత్రుల్లో అత్యవసర సేవల ఏర్పాట్లు అత్యంత దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐసీయూల్లో అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవడంలో ఆయా దేశాలు విఫలం అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.