కరోనాతో ఒకేసారి కన్నుమూసిన దంపతులు..చేతిలో చేయి వేసి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ..

  • Published By: nagamani ,Published On : July 2, 2020 / 01:20 PM IST
కరోనాతో ఒకేసారి కన్నుమూసిన దంపతులు..చేతిలో చేయి వేసి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ..

కష్టమైనా సుఖమైనా కలిసే ఉంటాం..కలిసే బతుకుతాం అని పెళ్లిరోజున ప్రమాణాలు చేసని దంపతుల్ని చావు కూడా విడదీయలేకపోయింది. ఎంతోమంది జీవితాలను అల్లకల్లోలం చేసే కరోనా మహమ్మారి సోకిన దంపతులు చావుకు భయపడలేదు. 53ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా కాపురాన్ని సాగించిన ఆ దంపతులు కరోనా సోకి ఇద్దరూ ఒకరోజున ఒకేసారి చేతిలో చేయి వేసుకుని చావుకూడా మనల్ని విడదీయలేదని ఒకరితర్వాత ఒకరు ప్రాణాలు వదిలారు.

కోవిడ్-19తో ఆస్పత్రిపాలైన ఈ వృద్ధ జంట చివరి క్షణాలు గురించి తెలిస్తే గుండె బరువెక్కుతుంది. ఎంతటివారికైనా కన్నీళ్లు రాకమానవు. జీవితాంతం కలిసే ఉంటామని ప్రమానం చేసిన ఆ జంట.. మరణంలో కూడా మాట నిలబెట్టుకున్నారు. ఈ విషాద ఘటన అమెరికాలోని టెక్సాస్ లోచోటుచేసుకుంది.

టెక్సాస్‌కు చెందిన బెట్టీ టర్ప్‌లే 80 ఏళ్లు. కుర్టీస్ టర్ప్‌లే 79 ఏళ్లు.వీరికి కరోనా సోకింది. హాస్పిటల్‌లో చికిత్స కూడా తీసుకుంటున్న సమయంలో 53 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నవారి జీవితాలు కరోనా మహమ్మారి సోకి ఇద్దరూ ఒకేరోజున కన్నుమూశారు. అంత పెద్ద వయస్సులో కూడా వారు కరోనా సోకిందని భయపడలేదు. నేను లేకపోతే భర్త్ ఏమైపోతాడని భార్య..నేను పోతే తను ఏమైపోతుందోనని భర్త ఇలా ఒకరి కోసం మరొకరు కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు.

వారు బతకడం కష్టమని డాక్టర్లు చెప్పటంతో వారి కొడుకు ఆస్పత్రి సిబ్బంది మాట్లాడి..వారిద్దరి బెడ్స్‌ను పక్క పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. ఆఖరి క్షణాల్లో వారి నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదు. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కళ్లతోనే మాట్లాడుకున్నారు. భార్య బెట్టీ కన్నుమూసిన గంటలోపే భర్త కుర్టీస్ కూడా చనిపోయాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరూ కలిసే కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఎంతో సంతోషంగా..అన్యోన్యంగా ఉండే అమ్మానాన్నలు ఒకేసారి చనిపోవటంతో వారి కొడుకు టిమ్ తల్లడిల్లిపోయాడు. ‘‘కరోనాను జయించి అమ్మకోసం బతికటానికి నాన్న చాలా ప్రయత్నించారు. ఎందుకంటే.. అమ్మ కూడా కరోనాను జయిస్తుందని నమ్మారు. అమ్మ వైరస్‌ను జయించి ఆరోగ్యంతో కోలుకుంటుందని ఎంతగానో అనుకున్నారు. ఆశపడ్డారు.

ఆమె కోసమే తాను కూడా ప్రాణాలతో ఉండాలని చికిత్స చాలా ఓపిగ్గా చేయించుకున్నారు. కానీ అమ్మ ఇక బతకటం కష్టమని డాక్టర్లు చెప్పటంతో ఇక నేను బతికి ఉండి ఏంటి అని అనుకున్న నాన్న..కూడా జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారేమో..అందుకే..అమ్మ చనిపోయిన కొద్ది క్షణాల్లోనే బాధను తట్టుకోలేక కన్నుమూశారు’’ అని కన్నీటితో తెలిపాడు. ఇక అమ్మానాన్నలు లేని లోటు నాకు ఎప్పటికీ తీరనిది అంటూ వాపోయాడు. అతని బాధను చూసిన డాక్టర్లు అతన్ని ఓదార్చారు. ఇటువంటి ఎన్నోవిషాద ఘటనలు చూడాల్సి వస్తోందని కంటతడి పెట్టారు కరోనా మహమ్మారితోపోరాడే డాక్టర్లు.వైద్య సిబ్బంది.

Read:2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు