అధికంగా నీళ్లు తాగించి కన్నకొడుకుని చంపిన తల్లిదండ్రులు

  • Published By: nagamani ,Published On : June 24, 2020 / 06:36 AM IST
అధికంగా నీళ్లు తాగించి కన్నకొడుకుని చంపిన తల్లిదండ్రులు

త‌ల్లిదండ్రుల అతి శ్రద్ధ..అత్యుత్సాహం 11ఏళ్ల కన్నకొడుకు చావుకు కారణమైంది. అమెరికాలోని కొలరాడోలో నివాసముంటున్న  రైన్‌, తారాలకు జాకరీ సబిన్ అనే 11ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతనికి మూత్ర సమస్య ఉంది. అతి మూత్రం చాలా చిక్కగా..ముదురు పసుపు రంగులో వస్తోంది.దీంతో వారు సబిన్ ను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లగా మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు.  దీంతో తల్లిదండ్రులు సబిన్ ను ‘‘నువ్వు నీళ్లు తక్కువగా తాగుతున్నావు..అందుకే ఈ సమస్య కాబట్టి ఇకనుంచి నీళ్లు చాలా ఎక్కువ తాగాలని చెప్పారు. 

అలా ప్రతీ రోజు తారా సబిన్‌ను స్కూల్ బ్యాగ్ లో ఫుల్ గా వాటర్ బాటిల్ పెట్టేది. ఈ వాటర్ మొత్తం తాగాలని తరువాత స్కూల్లో ఉండే వాటర్ కూడా తాగాలని చెప్పేది. కానీ సబిన్ నీరు సరిగ్గా తాగేవాడు కాదు. అలా ఓ రోజు స్కూల్  నుంచి ఇంటికి తీసుకురావటానికి వెళ్లిన తారా స్కూల్ కు వెళ్లేటప్పుడు  ఇచ్చి వాటర్ బాటిల్ లో ఫుల్ గా  ఉండటంతో నీళ్లు ఎందుకు తాగలేదని అడిగింది. దానికి సబిన్ ఏమీ సమాధానం చెప్పకపోవటంతో కొడుకుపై స‌బిన్‌పై గట్టిగా అరిచింది.ఇంటికి తీసుకొచ్చాక తల్లిదండ్రులిద్దరూ పిల్లాడిపై బాగా అరిచారు. తరువాత సబిన్ ను వంటగదిలో పెట్టి తలుపులేసేశారు.

మేము చెప్పేంత వ‌ర‌కు బ‌య‌టికి రావొద్ద‌ని..నీళ్లు తాగితేనే తలుపులు తీస్తామని లేకుండా అక్కడే ఉండాలని హెచ్చ‌రించారు. వాటర్ తాగమని బైటనుంచి భయపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులపై కోపం వచ్చిన సబిన్ అలా  నాలుగు గంటలసేపు నీరు తాగుతూ తాగుతూ..మోతాదుకు మించి తాగేశాడు. తరువాత కాసేపటికి సబిన్ ఏం చేస్తున్నాడో చూద్దామని తలుపులు పేరెంట్స్ త‌లుపు తీసి చూసేస‌రికి ప‌డిపోయి ఉన్నాడు.

తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు. కాసేపటికి వాంతులు అయ్యాయి. దీంతో సబిన్ నీరసించిపోయాడు. నీరసంగా ఉన్నాడని విశ్రాంతి తీసుకుంటాడులే అని బెడ్ మీద ప‌డుకోబెట్టారు. కాసేపటిని లేచిన సబిన్ వింత వింతగా మాట్లాడాడు. నీరసంతో అలా మాట్లాడుతున్నాడులే అని పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం సబిన్ ను చూసేస‌రికి శ‌రీర‌మంతా చ‌ల్ల‌గా మారిపోయి బిగుసుకుపోయింది. దీంతో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా అప్పటికే సబిన్ చ‌నిపోయాడని డాక్టర్లు చెప్పారు.

సబిన్ ఆహారం తినకుండా నాలుగు గంటల సేపు సుమారు 83 లీటర్ల నీటిని తాగి ఉంటాడని వైద్యులు అంచనా వేశారు. తాము వేసిన శిక్ష వల్లే బాలుడు చనిపోయాడని భావించిన రేన్, తారాలు.. పోలీసుల ముందు లొంగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిద్దరిపై  ఎల్ పాసో కౌంటీ జైలులో బెయిల్ లేకుండా నిర్బంధించబడ్డారు.

Read: పాక్‌ క్రికెట్‌ జట్టులో 10 మందికి కరోనా