US Couple: చనిపోయిన పిల్లల పేర్లతో దశాబ్దాలుగా అమెరికాలో బతికేస్తున్న దంపతులు

యునైటెడ్ స్టేట్స్‌లో దశాబ్దాల తరబడి ఫేక్ పేర్లతో ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా 1955లో పుట్టిన వాల్టర్ ప్రిమ్‌రోస్, భార్య గిన్ మారిసన్ లను హవాలీలో శుక్రవారం అరెస్ట్ చేశారు. డాక్యుమెంట్ల ప్రకారం.. వారి ఇంట్లో దంపతులిద్దరూ యూనిఫాంలో ఉన్న ఫొటో కనిపించింది.

US Couple: చనిపోయిన పిల్లల పేర్లతో దశాబ్దాలుగా అమెరికాలో బతికేస్తున్న దంపతులు

 

 

US Couple: యునైటెడ్ స్టేట్స్‌లో దశాబ్దాల తరబడి ఫేక్ పేర్లతో ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా 1955లో పుట్టిన వాల్టర్ ప్రిమ్‌రోస్, భార్య గిన్ మారిసన్ లను హవాలీలో శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

డాక్యుమెంట్ల ప్రకారం.. వారి ఇంట్లో దంపతులిద్దరూ యూనిఫాంలో ఉన్న ఫొటో కనిపించింది. దాని ఆధారంగా ఎంక్వైరీ మొదలుపెట్టారు.

1970లలో టెక్సాస్‌లో కలిసి చదువుకున్న ఈ జంట 1980లో అక్కడే వివాహం చేసుకున్నారు. 1987లో, వారు బాబీ ఫోర్ట్, జూలీ మాంటేగ్‌ల గుర్తింపును దక్కించుకున్నారు. సంవత్సరాల క్రితం వారిద్దరి పిల్లలను ఇంటికి సమీపంలోనే పాతిపెట్టారు.

కొత్త గుర్తింపులతో 1988లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 1994లో బాబీ ఫోర్ట్ అని పిలిచే కోస్ట్ గార్డ్‌లో జాయిన్ అయ్యాడు. అక్కడ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాంట్రాక్టర్‌గా ఉద్యోగం తీసుకునే ముందే 20 సంవత్సరాలు పనిచేశాడు.

Read Also: అమెరికా పార్కులో కూర్చొన్న భారత సంతతి వ్యక్తి హత్య

అలా కొన్నేళ్లుగా.. ఈ జంట తప్పుడు ఐడెంఫికేషన్‌తో డ్రైవింగ్ లైసెన్స్‌లు, అనేక పాస్‌పోర్ట్‌లతో సహా అఫీషియల్ సర్టిఫికేట్లను తీసుకున్నారు. ఆ ఫేక్ ఐడెంటిటీలను అన్నింటినీ స్వాధీనపరచుకున్నారు ఫెడరల్ అధికారులు.