Sri Lanka crisis: ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. ముద్దులతో నిరసన తెలిపిన జంట.. ఫొటో వైరల్

బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sri Lanka crisis: ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. ముద్దులతో నిరసన తెలిపిన జంట.. ఫొటో వైరల్

Sri Lanka (1)

Sri Lanka crisis: శ్రీలంక అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే వల్లే దేశానికి ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో గొటబాయ మాల్దీవులకు ప్రత్యేక సైనిక హెలికాప్టర్ లో పరారయ్యాడు. అయితే అక్కడి నుంచి సింగపూర్ కు గొటబాయ కుటుంబంతో కలిసి పారిపోయినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. గత ఐదు నెలలుగా దేశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పదేపదే వేలాది మంది ప్రజలు అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడిస్తున్నారు. తాజాగా ప్రధాని నివాసంపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రధాని విక్రమ సింఘే దేశంలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దేశం ఆందోళనలతో అట్టుడుకుతున్న క్రమంలో ఓ చిత్ర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sri Lanka: ఎట్ట‌కేల‌కు అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా.. శ్రీ‌లంక‌లో సంబ‌రాలు

బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రధాని కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలకు, ఆందోళన కారులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు ఈ ఫొటోను ట్విటర్ లో పోస్టు చేయగా.. నెటిజన్లు కామెంట్లతో దాడిచేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ముద్దుపెట్టుకోవటానికి ఇక్కడే సమయం దొరికిందా అంటూ వ్యగ్యంగా ప్రశ్నించాడు.

Sri Lanka: ఆందోళనలను అణచివేయడానికి సిద్ధం?.. కొలంబో రోడ్లపై పెద్ద ఎత్తున మిలటరీ వాహనాలు.. వీడియో 

రాజపక్స పారిపోయిన తర్వాత విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఆగ్రహించిన లంకేయులు పెద్దఎత్తున రోడ్లపైకొచ్చారు. ఈ క్రమంలో ఒకరు మరణించగా, 80మందికిపైగా గాయపడ్డారు. ప్రధానమంత్రి కూడా పదవీ విరమణ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. అయితే గొటబాయ సహా విక్రమసింఘే సైతం రాజీనామా చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. ఇదిలాఉంటే జూలై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని శ్రీలంక స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు.