ఇంటి చెత్తలో రూ.14 లక్షలు: నిజాయితీగా పోలీసులకు సమాచారం ఇచ్చిన రీసైక్లింగ్ సిబ్బంది

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 10:20 AM IST
ఇంటి చెత్తలో రూ.14 లక్షలు: నిజాయితీగా పోలీసులకు సమాచారం ఇచ్చిన రీసైక్లింగ్ సిబ్బంది

ఓ ఇంటికి సంబంధించని చెత్తను రీసైక్లింగ్ చేస్తున్న సిబ్బందికి చెత్తలో రూ.16 లక్షలు కనిపించాయి. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఇంగ్లాండ్‌ జరిగింది. బర్న్హమ్ ఆన్ సీ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు బంధువు చనిపోయాక వారే అన్ని కార్యక్రమాలు చేశారు. అంత్యక్రియల  కార్యక్రమాలు పూర్తయ్యాక సంప్రదాయం ప్రకారం మృతుడి ఇంటిని శుభ్రంచేశారు. ఈ క్రమంలో వారికి ఆ ఇంట్లో కొన్ని పాత అట్టపెట్టెలు కనిపించాయి. వాటితో సహా మొత్తం చెత్తను రీసైక్లింగ్ సెంటర్‌కు తరలించారు. 

అలా తరలించిన ఆ వేస్టేజ్ తో పాటు ఉన్న ఆ అట్టపెట్టెలను రీసైక్లింగ్ చేసేందుకు తరలించేముందు చెక్ చేశారు. వాటిలో వారికి 15 వేల పౌండ్లు(రూ. 14 లక్షలు) కనిపించాయి. దీంతో రీసైక్లింగ్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే   రీసైక్లింగ్ సెంటర్ వద్దరకు వచ్చిన పోలీసులు అక్కడున్న సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఆ అట్టపెట్టెలు అప్పగించిన జంటకు సంబంధించిన ఫోను నంబరు తెలుసుకున్నారు. 

ఆ జంటను ప్రశ్నించగా..తమ బంధువు ఒకరు చనిపోగా..ఇంటిని క్లీన్ చేసి వేస్టేజ్ ను రీసైక్లింగ్ సెంటర్ కు తరలించామనీ కానీ చనిపోయిన తమ బంధువు డబ్బుని అట్టపెట్టెలో ఉంచాడనే విషయం తమకు తెలియదని తెలిపారు. ఈ డబ్బు మీకే చెందుతుందని ఆ  డబ్బుని తీసుకెళ్లమంటూ ఇచ్చి పంపించారు. కాగా..ఈ నగదు సమాచారాన్ని తెలియజేసి..నిజాయితీని చాటుకున్న రీసైక్లింగ్ సెంటర్ సిబ్బందిని పోలీసులు అభినందించారు.