మహిళాఏలుబడిలోని దేశాలే…కరోనాను తొక్కిపెట్టి…అంతం చేస్తున్నాయి

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 02:10 PM IST
మహిళాఏలుబడిలోని దేశాలే…కరోనాను తొక్కిపెట్టి…అంతం చేస్తున్నాయి

కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని బలాలు వాడుతున్నాయి. కొన్ని మాత్రమే సూపర్ సక్సెస్. ఆ దేశాలను పాలిస్తున్నవాళ్లెవరో తెలుసా? 

న్యూజిలాండ్ :

new zeland

న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardern. ఆమె ఎమోషనల్ లీడర్. కరోనా రాగానే ప్రజల వైపు నుంచి ఆలోచించింది. చురుగ్గా కదలింది. దేశాన్ని కదలించింది.  కరోనా వైరస్ సోకిన వారి సంఖ్యను బాగా తగ్గించింది. ఈ దేశంలో ఇప్పటిదాకా ఇద్దరుమాత్రమే చనిపోయారు. కరోనా కంట్రోల్.   
 
జర్మనీ :

germany

Angela Merkel 2005 నుండి Germany chancellorsలో ఉన్నారు. ఎవరినైనా, చివరకు ట్రంప్ నైనా ఆమె నిలదీయగలరు. ఆ ధైర్యంతోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను నియంత్రించారు. అసలు కరోనా ఎక్కడ నుంచి మొదలైందో అక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ట్రాక్ చేసి, ట్రీట్ చేశారు.  95 శాతం రికవరీ రేటును సాధించగలిగారు.

ఫిన్ లాండ్ :

finland

finland prime minister Sanna Marin అనగానే ఆమె వయస్సు గుర్తుకొస్తుంది. ఆమెకు 34ఏళ్లు. ఈ యువనేత నాయకత్వంలో 88 శాతం రికవరీ రేటును నమోదైయ్యింది.

బెల్జియం : 

belgium

Belgium Prime Minister, Sophie Wilmès కూడా కరోనా వైరస్ సోకి మరణించే వారి సంఖ్యను తగ్గించటంలో విజయవంతమయ్యారు. 67 శాతం రికవరీ రేటును సాధించగలిగారు. వెల్లువలా కరోనా వచ్చిపడుతున్నా, అమె దేశాన్ని నడిపించగలిగారు. (రెండు వారాలుగా 25 జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్..)

వీళ్లంతా సంప్రదాయ రాజకీయ పరిభాషలో చెప్పాలంటే చిన్నవాళ్లు, పెద్దగా రాజకీయం తెలియనివాళ్లు. ఈ ఊకదంపుడు మాటలను ఊడ్చేసి, కరోనాను కంట్రోల్ చేసి, ప్రపంచానికే మార్గం చూపించారు.