COVID-19: ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు చేరిన తొలి విమానం

కోవిడ్‌ ఇండియావ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్ట్రేలియాకు వచ్చేవారికి ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో మే 15 నుంచి....

COVID-19: ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు చేరిన తొలి విమానం

India

COVID-19: కోవిడ్‌ ఇండియావ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్ట్రేలియాకు వచ్చేవారికి ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో మే 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న దేశ పౌరులను తీసుకువచ్చేందుకు స్పెషల్ విమానాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

చెప్పిన దాని ప్రకారమే.. ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన ఫస్ట్ ఫ్లైట్ శనివారం డార్విన్‌ చేరుకుంది. కాంటాస్‌ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఆస్ట్రేలియా చేర్చారు. ప్రయాణానికి ముందే వీరి నుంచి రెండు సార్లు చేయించుకున్న కరోనా రిపోర్టులను పరిశీలించారు. వాటిల్లో నెగెటివ్ ఉంటేనే వారిని బోర్డింగ్ చేయనిచ్చారు.

అలా వెళ్లిన వారిని హోవార్డ్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. మెడికల్ విధానాలను పాటిస్తూ.. పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇండియా నుంచి మొదటి విమానాన్ని తీసుకురాగలిగామని చెప్పడం సంతోషంగా ఉంది.

ఇక వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం. ఇదే అనుసరిస్తున్నాం. మే నెలలో మరో 2 రాయల్‌ ఆస్ట్రేలియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ విమానాలు ఈ దేశస్థులను స్వదేశానికి తీసుకురానున్నాయి. జూన్‌ నాటికి వెయ్యి మంది స్వదేశానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.