కరోనా గుప్పిట్లో ప్రపంచమే బందీ. ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదు.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 07:21 AM IST
కరోనా గుప్పిట్లో ప్రపంచమే బందీ. ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదు.

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలకు పైగా వైరస్ వ్యాపించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 8.57లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 46 వేల మందికి పైగా మరణించారు. కానీ ఇప్పటికి కరోనా వైరస్ సోకని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం..

palau island

ఉత్తర ఫసిపిక్ లోని పలావు ద్వీపంలో మెుత్తం 18వేల మంది జనాభా నివసిస్తున్నారు. కానీ ఈ ద్వీపంలో ఇప్పటివరుకు ఒక్క కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదుకాలేదు. పొరుగున ఉన్న ప్రాంతాన్నికి టన్నుల కిలోమీటర్ల దూరంలో పలావు ద్వీపం చుట్టూ ఫసిపిక్ మహాసముద్రం ఉంది. ఈ ద్వీపం కూడా వైరస్ ను అరికట్టేందుకు పలావు నుంచి తాహితీ ప్రాంతం వరకు ప్రయాణ సదుపాయాన్ని నిలిపివేసింది. పాఠశాలను మూసివేసింది. అంతేకాకుండా లాక్ డౌన్, అత్యవసర సమయాల్లో కావాల్సిన నియమాలను కూడా అమలు చేసింది.

samoa land

తూర్పు ఆసియా లోని ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు లేరని చెప్పింది. అంతేకాకుండా సమోవా, తుర్క్మెనిస్తాన్, ఉత్తరకొరియా, అంటార్కిటికా ప్రాంతాలు మంచుతో కూడినవి. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఒక్క కేసు నమోదుకాలేదు. ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాల్లోను, బోట్స్ వానా , ల్యాండ్ లాక్ లెసోతో దేశాలు దక్షిణాఫ్రికా సరిహద్దులో ఉన్నప్పటికీ ఒక్క కోవిడ్ 19 కేసును నమోదు చేయలేదు.

Also Read | 4 రెడ్ జోన్లు, 2 కర్ఫ్యూ ప్రాంతాలు.. విజయవాడలో భయం, భయం