ప్యాంట్ లేకుండానే WFH చేస్తున్న వారు 47శాతం మంది

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 07:15 AM IST
ప్యాంట్ లేకుండానే WFH చేస్తున్న వారు 47శాతం మంది

COVID-19 కారణంగా ఇంటి నుంచే పనిచేసుకోవడం తప్పడం లేదు. ఈ కారణంగా ఇక ఫార్మల్ డ్రెస్లు వేసుకుని బయటకు వెళ్లాల్సిన పనిలేకుండాపోయింది. పైజమాలు, షార్టులు, బాక్సర్లు వేసుకుని రోజుకానిచ్చేస్తున్నారు. కొత్త అలవాటుతో ఎంత మంది గడిపేస్తున్నారనే దానిపై సర్వే నిర్వహించింది యూగొవ్ (YouGov). ఇందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇందులో పాల్గొన్న వారిలో 47శాతం మంది అమెరికన్లు కాళ్లకు బట్టలు వేసుకోకుండానే పనులు చేసుకుంటున్నారట. (ప్యాంట్లు, స్కర్టులు, షార్టులు)లాంటివి వేసుకోకుండానే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వారిలో 39శాతం మంది ఫ్యాన్సీ బట్టలు వేసుకుని నడుం వరకూ మాత్రమే వేసుకుంటున్నారు. 

ఇది మగాళ్ల వరకే పరిమితం కాదు. మహిళల్లోనూ మూడు రెట్లు ఇలాంటి అలవాట్లే కనిపిస్తున్నాయి. ఆఫీస్ మీటింగ్స్ కోసం వీడియో కాల్స్ చేసుకోవడానికి కెమెరా ముందుకు వచ్చినప్పుడే రెడీ అవుతున్నారట. వీడియో స్టార్ట్ అవడానికి ముందే 54శాతం మంది తల దువ్వుకోవడం, బ్రష్ చేసుకోవడానికి ముందే ఇలా తంటాలు పడుతున్నారు. వీరిలో 70శాతం మంది మగాళ్లు ఉంటే లేడీస్ లో 40శాతం మంది ఉన్నారు. 

కెమెరా ముందుకు వచ్చేటప్పుడు 51శాతం మంది ముఖం కడుక్కోవడం, 50శాతం మంది పళ్లు తోముకోవడం, 24శాతం మంది షేవింగ్ చేసుకోవడం, 19శాతం మంది మేకప్ వేసుకోవడం, 29శాతం మంది కంఫర్టబుల్ గా చేసుకుని కూర్చోవడం వంటి చేస్తున్నారంట. మరి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిలో మీరూ ఉన్నారా.. ఎవ్వరికీ చెప్పొద్దులెండి ఆ వివరాలు మీ దగ్గరే ఉంచుకోండి..

Also Read | జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్