Lives Saved Lockdown: లాక్​ డౌన్ వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుకోగలిగాం : ఆక్స్ ఫర్డ్ వర్శిటీ అధ్యయనం

కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎంతోమంది ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసింది.కానీ లాక్ డౌన్ వల్ల కూడా ఎంతో మంచి జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గింది.అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అంతేకాదు లాక్ డౌన్ వల్ల ఎన్నో జబ్బుల సంక్రమణలు కూడా తగ్గాయని..ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

Lives Saved Lockdown: లాక్​ డౌన్ వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుకోగలిగాం : ఆక్స్ ఫర్డ్ వర్శిటీ అధ్యయనం

People's Lives Saved (2)

Lives Saved Lockdown:  కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎంతోమంది ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసింది.కానీ లాక్ డౌన్ వల్ల కూడా ఎంతో మంచి జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గింది.అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అంతేకాదు లాక్ డౌన్ వల్ల ఎన్నో జబ్బుల సంక్రమణలు కూడా తగ్గాయని..ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. లాక్ డౌన్ వల్ల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాల వల్ల సక్రమించే జబ్బులు తగ్గాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది.

ఇది ఏ ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు లాక్ డౌన్ వల్ల పలు రోగాల సంక్రమణ తగ్గాయని తెలిపింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించడం వల్ల లక్షలాది ప్రాణాలను కాపాడుకోగలిగామని..తద్వారా మరణాల సంఖ్య చాలా తక్కువగా నమోదయ్యాయని..ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. లాక్ డౌన్ తో ప్రపంచ దేశాలను వణికించిన వణికిస్తున్న కరోనా మహమ్మారితో పాటు న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ జబ్బుల సంక్రమణ కూడా భారీగా తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్ లాగానే ఆయా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలూ శ్వాసకోశ వ్యవస్థ ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయని అధ్యయనం పేర్కొంది. న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ జబ్బుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్నాయి. ఈ లాక్ డౌన్ ల వల్ల ఇటువంటి జబ్బులతో చనిపోయేవారి సంఖ్య తగ్గిందనీ..తద్వారా లాక్ డౌన్ వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలిగామని తెలిపింది.

గత రెండేళ్లతో పోలిస్తే ఇటువంటి జబ్బుల వల్ల జరిగే మరణాలు తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. 2020 జనవరి నుంచి మే మధ్య సదరు వ్యాధులకు సంబంధించిన కేసులు భారీగా తగ్గాయని వెల్లడించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ప్రతి దేశంలోనూ కేసులు సగటున 6 వేలు తగ్గాయని తెలిపింది.

లాక్ డౌన్ విధించిన 4 వారాల్లో స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా కేసులు 68 శాతం, 8 వారాల్లో 82 శాతం మేర తగ్గాయని, అదే సమయంలో స్ట్రెప్టోకోకస్ ఆల్గాలాక్టియే కేసులు మాత్రం తగ్గలేదని వివరించింది. 26 దేశాలకు చెందిన జాతీయ లేబొరేటరీలు, నిఘా కార్యక్రమాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాలకు వచ్చారు. కాగా, ఒక్క 2016లోనే ప్రపంచవ్యాప్తంగా 33.6 కోట్ల మంది శ్వాసకోశ జబ్బుల బారిన పడగా, 24 లక్షల మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.