COVID-19: కొవిడ్‌తో కొత్త డయాబెటిస్ రావొచ్చు – స్టడీ

కొవిడ్-19తో వచ్చే ప్రమాదాల్లో డయాబెటిస్ కూడా ఓ సమస్య కావొచ్చట. మహమ్మారి ప్రభావంతో హాస్పిటలైజ్ అయిన వాళ్లలో కొత్తగా డయాబెటిస్ కనిపిస్తుందని రీసెర్చర్లు అంటున్నారు. హైపర్‌గ్లేసెమియా.. లేదా ఎక్కువ స్థాయిలో బ్లడ్ షుగర్ నమోదై కొన్ని నెలల పాటు ఇన్ఫెక్షన్ ఉంటుందని తేలింది.

COVID-19: కొవిడ్‌తో కొత్త డయాబెటిస్ రావొచ్చు – స్టడీ

New Project

COVID-19: కొవిడ్-19తో వచ్చే ప్రమాదాల్లో డయాబెటిస్ కూడా ఓ సమస్య కావొచ్చట. మహమ్మారి ప్రభావంతో హాస్పిటలైజ్ అయిన వాళ్లలో కొత్తగా డయాబెటిస్ కనిపిస్తుందని రీసెర్చర్లు అంటున్నారు. హైపర్‌గ్లేసెమియా.. లేదా ఎక్కువ స్థాయిలో బ్లడ్ షుగర్ నమోదై కొన్ని నెలల పాటు ఇన్ఫెక్షన్ ఉంటుందని తేలింది.

బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చర్లు..కొవిడ్ వచ్చిన 551మంది హెల్త్ కండిషన్ ను ఇటలీలోని మార్చి 2020 నుంచి మే 2020వరకూ గమనించారు.

వారిలో సగం మంది అంటే 46శాతం పేషెంట్ల డయాబెటిస్ (హైపర్‌గ్లేసెమియా) లక్షణాలు కనిపించలేదు. 35శాతం మందిలో లక్షణాలు కనిపించి కనీసం ఆరు నెలల పాటు అలాగే ఉన్నాయి. నెఫ్రాలజీ డివిజన్ కు చెందిన పౌలో ఫియోరినా అనే రచయిత ఈ విషయాలను కన్ఫామ్ చేశారు.

గ్లూకోజ్ అసమతుల్యతలు ఉన్న పేషెంట్లతో పోలిస్తే.. హైపర్‌గ్లైమిక్ పేషెంట్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కువ కాలం హాస్పిటలైజేషన్, దారుణమైన క్లినికల్ పరిస్థితులు, ఎక్కువ మోతాదులో ఆక్సిజన్.. వెంటిలేషన్ అవసరం, ఐసీయూ ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరముండటం కావాల్సి వచ్చింది.

ఈ డయాబెటిస్ రకం వచ్చిన వారిలో హార్మోన్ లెవల్స్ కూడా సరిగా లేవని తెలిసింది. దీని కారణంగా ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందట. కొవిడ్ శరీరంలో ఎక్కువగా ఉన్న వారిలోనే ఇది కనిపించడంతో దాని కారణంగా వచ్చిందని నిర్ధారణ అయింది.