స్కూళ్లల్లో వ్యక్తిగత తరగతులు.. కమ్యూనిటీ వ్యాప్తికి దారితీయవు : CDC

స్కూళ్లల్లో వ్యక్తిగత తరగతులు.. కమ్యూనిటీ వ్యాప్తికి దారితీయవు : CDC

Covid-19 Outbreaks Aren’t Driven by In-Person Classes : ఎలిమెంటరీ స్కూళ్లల్లో వ్యక్తిగత తరగతులతో కమ్యూనిటీ వ్యాప్తికి దారితీయలేదని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో దాదాపు మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత తరగతులకు హాజరుకావడం ద్వారా కమ్యూనిటీ వ్యాప్తికి కారణం కాదని సైంటిస్టులు అధ్యయనంలో గుర్తించారు. 24 ఏళ్లలోపు విద్యార్థుల్లో 2.87 మిలియన్ కరోనా కేసులపై అధ్యయనం చేశారు.

స్కూల్ వయస్సు విద్యార్థులు వ్యక్తిగతంగా నేర్చుకునే తరగతులతో వైరస్ వ్యాప్తి రేటు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉన్న ప్రాంతాలకు సమానంగా ఉన్నాయని తేలింది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. పాఠశాలలను అన్నింటికి కంటే చివరిగా మూసివేయాలని సూచించారు. ముందుగా స్కూళ్లనే తెరవాల్సిందిగా అధ్యయనంలో తేల్చారు. వేసవి, శీతాకాలంలో ఇన్ఫెక్షన్లకు దారితీసిన 18 నుండి 24 ఏళ్ల వయస్సు గల యువతీయువకులు కమ్యూనిటీ వ్యాప్తికి ఎక్కువ కారణమై ఉండొచ్చునని నివేదికలో తెలిపింది. మూసివేసిన స్కూళ్లను తిరిగి తెరవాల్సిందిగా సిడీసీ సిఫార్సు చేస్తోందని నివేదిక పేర్కొంది.

పిల్లల సంరక్షణ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరవాల్సిందిగా సూచించింది. ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కోవిడ్ -19 వ్యాప్తి.. ఉన్నత పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలను తిరిగి తెరవడం కంటే తక్కువగా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్కూళ్లలో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సురక్షితంగా ఉండేందుకు సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. తద్వారా పిల్లలు, వృద్ధులకు వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ఏజెన్సీ పేర్కొంది.