కటిక పేదరికంలోకి 100కోట్ల మంది.. కారణం ఇదే: ఐక్యరాజ్య సమితి

  • Published By: vamsi ,Published On : December 7, 2020 / 09:41 AM IST
కటిక పేదరికంలోకి 100కోట్ల మంది.. కారణం ఇదే:  ఐక్యరాజ్య సమితి

covid 19:ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పటికే దేశాలు ఎన్నో ఈ మహమ్మారి కారణంగా తీవ్ర కష్టాల్లోకి.. భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటి వరకు కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితం అవగా.. టీకా సిద్ధమైన తర్వాత ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో కరోనా వైరస్ నియంత్రణ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అంటువ్యాధి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై అంతకంటే ఎక్కువ కాలం ఉంటుందని, 2030 నాటికి, ఈ అంటువ్యాధి వలన కలిగే మాంద్యం కారణంగా 20కోట్ల మంది కొత్తగా పేదరికానికి గురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తం వంద కోట్ల మంది కటిక పేదరికంలోకి వెళ్లిపోతారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.



ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పేదరిక వ్యాప్తికి సంబంధించి అంచనా వేయగా.. ఆ అంచనా ప్రకారం.. కోవిడ్-19 ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని, ప్రపంచంలో 20.7 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదరికానికి చేరుకుంటారని అధ్యయనం అంచనా వేస్తుంది. మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చెబుతున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.



కొవిడ్‌-19 ప్రభావం వల్ల పెట్టుబడులు, ఉపాధి కల్పన, సృజనాత్మకత, విద్యారంగం, వాణిజ్యం, సరఫరా, వినియోగం వంటి అంశాలు బలహీనం అవ్వగా.. ఎన్నడూ లేనంతగా కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించిన అధ్యయనం చెబుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గత పదేళ్లలో అనేక సమస్యలతో సతమతం అవుతుండగా.. ఇటువంటి సమయంలో కరోనా మరింత ప్రభావం చూపుతున్నట్లుగా ఐరాస చెబుతుంది.



అంతకుముందు కరోనా రాకముందు ఈ అంచనాలు చాలా తక్కువగా ఉండగా.. పేదరికం తగ్గే పరిస్థితి ఉందని అంచనాలు వెయ్యగా.. కరోనా ఆ అంచనాలను తారుమారు చేసింది.