గర్భిణులూ జాగ్రత్త… కరోనాతో ప్రసవంలో మరణ ప్రమాదం: WHO 

  • Published By: nagamani ,Published On : June 13, 2020 / 07:05 AM IST
గర్భిణులూ జాగ్రత్త… కరోనాతో ప్రసవంలో మరణ ప్రమాదం: WHO 

ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఆరోగ్యవంతులే కరోనాకు డీలా పడిపడిపోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా గర్భిణులు మరింతగా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మరింత భద్రంగా ఉండాల్సిన అవసరం ఉందని..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చనిపోయే ప్రమాదముందని World Health Organization జనరల్ సెక్రటరీ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు.

కరోనా వైరస్ గర్భిణులు, బాలింతలు,నవజాత శిశువులు,చిన్నారులు, కౌమారదశలో ఉండేవారిపై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో గర్భిణులు..కడుపులో బిడ్డకూడా చనిపోయే ప్రమాదం ఉందని WHO తెలిపింది. 

గర్భిణులకు కరోనా వస్తే  గర్భస్రావం జరగొచ్చు..నెలలు నిండకుండానే ప్రసవం జరగొచ్చు..లేదా శిశువు గర్భంలోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇటువంటి ఘటనలు చైనాలోని ఉహాన్ లో జరిగాయి.కాబట్టి గర్భిణులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

తల్లులు బిడ్డలకు పాలిస్తే కరోనా వైరస్ నుంచి నవజాత శివులకు కాపాడుకోవచ్చని..వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తల్లిపాలల్లో పుష్కలంగా ఉంటుందనీ..కాబట్టి బిడ్డలకు పాలిస్తే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పాలివ్వాలనీ..అలాగే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంచి ఆహారం తీసుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు.

కోవిడ్ -19 తో గర్భిణులకు నిపుణుల సలహాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వీలైనంత వరకూ గర్భిణులు బైటకు వెళ్లకూడదు.

వైరస్ సోకిన వ్యక్తులకు అత్యంత దూరంగా ఉండాలి.

వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకెళ్లాలి. కరోనా టెస్ట్ లు చేయించుకోవాలి..నిపుణులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి.

ఏది ముట్టుకున్నా వెంటనే చేతులు కడుక్కోవాలి..చేతుల్ని సాధ్యమైనంత వరకూ మొహానికి తగలకుండా చూడాలి. బైటనుంచి తెచ్చిన వస్తువులను..సరుకులను ముట్టుకోకూడదు..

ప్రయాణాలకు దూరంగా ఉండాలి.ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి.మాస్కులు ధరించటం..భౌతిక దూరం పాటించటం తప్పనిసరి.